టర్కీ పని ఖతం, చావు దెబ్బ కొట్టనున్న యురోపియన్ యూనియన్

టర్కి, ప్రస్తుతం ప్రపంచంలొ అత్యంత వివాదాస్పదంగా మారిన దేశం టర్కి. మొన్నటి వరకు టర్కి, తన దాయాది దేశమైన గ్రీస్ తొ గొడవ పడిన సంగతి తెలిసిందే. ఈ గొడవ చిలికి చిలికి గానవానగా మారి యుద్ధం వరకు దారితీసింది. అయితే జర్మని అధ్యక్షురాలు ఏంజెలా మార్కెల్ మధ్యవర్తిత్వం అహించడంతో ఈ గొడవ కొంత సర్ధుమణిగింది. మరలా ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదానికి, రాడికల్స్ కు పరోక్షంగా సపోర్టు చేయడమే కాకుండా, ఫ్రాన్స్ తో గొడవకు దిగింది. అంతేకాకుండా టర్కీ అధ్యక్షుడు “తైపి ఎర్డొగాన్” మరింత దిగజారి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయిల్ మాక్రాన్ ను వ్యక్తిగతంగా దూషించడం ప్రారంభించాడు

దీనితో పాటు ఫ్రాన్స్ వస్తువులను బహిష్కరించాలని టర్కీ అధ్యక్షుడు తైపి ఎర్డొగాన్ పిలుపునివ్వడం ఒక్కసారిగా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. రోజు రోజు మితిమీరిపోతున్న టర్కీ కు గట్టిగా బుద్ది చెప్పాలని యురోపియన్ దేశాలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. పైగా తీవ్రవాద దేశమైన పాకిస్థాన్ తో కలిసి టర్కి పనిచేయడం యురోపియన్ దేశాలకు చిరాకు తెపిస్తున్న మరో అంశం

మొత్తంగా మూడు రకాలుగా యురోపియన్ యూనియన్, టర్కి పై నిషేధం విధించే అవకాశలు కనబడుతున్నాయి అవి 1) టర్కీ ప్రధాన ఎగుమతులైన మెషినరి ట్రాన్స్‌పోర్టు ఎక్విమెంట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ను యూరప్ లొ నిషేధించడం 2) టర్కీ పై ఆర్ధిక, రక్షణ ఆంక్షలు విధించడం 3) టర్కీ కి అత్యంత కీలకమైన టర్కీ టూరిజం పై ఆంక్షలు విదించడం

పై మూడు అంశాలలను యురోపియన్ దేశాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కాగ ప్రధానంగా టర్కీ కు కీలకమైన టూరిజం ను దెబ్బకొట్టే విధంగా టర్కి టూరిజంపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికి టర్కి పై ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం కనబడుతుంది

1 thought on “టర్కీ పని ఖతం, చావు దెబ్బ కొట్టనున్న యురోపియన్ యూనియన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!