అర్నాబ్ గోస్వామి అరెస్టు తో సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర DGP

గత కొంతకాలంగా మహారాష్ట్రలొ జరుగుతున్న పరిణామాలు యావత్ భారతదేశాన్ని కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాల్గర్ సాధువుల హత్యలు, సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఆత్మహత్య, బాలీవుడ్ డ్రగ్ మాఫియా లాంటి విషయాలన్నీ దేశాన్ని కుదిపేశాయి. కాని ఆయా కేసులపై మహారాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. ఈ కేసుల విషయంలొ మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే ఈ కేసుల విషయంలొ జాప్యం చేస్తుందన్న స్పష్టంగా కనబడుతుంది
దీనితో రిపబ్లిక్ చానల్ అధినేత “అర్నాబ్ గోస్వామి” ఈ విషయాలపై విరుచుపడ్డాడు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచేత్తాడు. తన డిబేట్లతో మహారాష్ట్ర ప్రభుత్వానికి గొంతులొ వెలక్కాయలా మారాడు. దీనితో మొన్న అర్ధరాత్రి అత్యంత దారుణంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అయితే అర్నబ్ గోస్వామి అరెస్టు విషయం మహారాష్ట్ర DGP “సుబోద్ కుమార్” కు తెలియకుండా జరిగినట్టు తెలుస్తుంది. నిజానికి మహారాష్ట్ర DGP “సుబోద్ కుమార్” కు గొప్ప పేరు ప్రఖ్యాతులున్నాయి. నిజాయితీ పరుడిగా మంచి పేరుంది. ఇంతకు ముందు సుబోద్ కుమార్, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన RAW లొ పని చ్చేసిన అనుభవం ఉంది
అయితే అర్నాబ్ గోస్వామి అరెస్టు తొ తీవ్రంగా కలత చెందిన సుబోద్ కుమార్, తన DGP పదవిని వదిలి వేసినట్టు తెలుస్తుంది. తనకు ఏమాత్రం ప్రాముఖ్యత లేని పదవిలొ ఉండటం తన ఆత్మ గౌరవానికి భంగంగా భావించిన సుబోద్ కుమార్, తన DGP పదవికి రాజీనామా చేసి కేంద్ర సర్వీసులకు వెళుతున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర లొ ఏ క్షణంలొ ఏమైనా జరిగే అవకాశం ఉండటంతో సుబోద్ కుమార్ అన్నీ ఆలోచించి, తన DGP పదవిని వదిలివేసి కేంద్ర సర్వీసులకు వెళుతున్నట్టు తెలుస్తుంది