హిమాలయాల్లోని చైనా బంకర్లు బద్దలు కొట్టే సరికొత్త ఆయుధం భారత్ చేతుల్లోకి

గత ఆరు నెలల నుండి భారత్, చైనా ల మధ్య తీవ్రస్థాయిలొ విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గల్వాన్ ఘటన తరువాతి దగ్గర నుండి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దుల వద్ద ఏ క్షణంలోనైనా యుద్ధ వచ్చే అవకాశమున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. దీనితో ఇటు భారత్, అటు చైనా వేగంగా ఆయుధాలు సమకూర్చుకునే పనిలోపడ్దాయి.

ఇందులో భాగంగా చైనా, హిమాలయాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ బంకర్లను నిర్మిస్తుంది. వందల సంఖ్యలొ అత్యంత శక్తి వంతమైన ఆర్మీ బంకర్లను నెలకొల్పుతుంది. దాదాపు లక్ష మంది సైనీస్ పీపుల్స్ ఆర్మీ కు రక్షణ కల్పించేలా చైనా ఈ బంకర్ల నిర్మాణాలు చేపడుతుంది. ఒక్క సైనికులకు కోసం మాత్రమే కాకుండా ఈ బంకర్లలొ చైనా పెద్ద ఎత్తున ఆయుధాలను, ఆర్టిలరీ గన్స్ ను, రాకెట్లను తరలిస్తుంది

దీనితో ఈ విషయం కనిపెట్టిన భారత్, పర్వతాల్లోకి దూసుకుపోయి బంకర్లను బద్దలు కొట్టే సరికొత్త ఆయుధాలను అందిపుచ్చుకుంది. అవే Hammer Missils. అంటే ఇవి ప్రీసియన్ గైడెడ్ మునిషన్ మిసైల్స్. వీటికి ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్ డిఫెన్స్ సంస్థ తయారు చేస్తుంది. ఇవి ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్. వీటిని రాఫెల్ ఫైటర్ల నుండి, మిరేజ్ ల నుండి నేరుగా చైనా మిలటరీ బంకర్ల మీద ప్రయోగించవచ్చు. ఇవి హైబ్రిడ్ ఇంటర్ నావిగేషన్ సిస్టం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ తో పనిచేస్థాయి కావడంతో టార్గెట్ ను ఖచ్చితంగా చేధిస్థాయి. ఈ హేమర్ మిసైల్స్ 70 కిలోమీటర్ల రేంజ్ తొ ఇన్‌ఫ్రారెడ్ కిరణాలతో పనిచేస్థాయి

నిజానికి ఈ మిసైల్స్ తయారు చేయడానికి దాదాపు సంవత్సరకాలం పడుతుంది. కాని భారత్ ఇప్పటికిప్పుడు ఈ ఆయుధాలు కావాలని కోరడంతో, తమ ఆయుధాగారం నుండి ఈ మిసైల్స్ ను భారత్ కు అందించడానికి ఫ్రాన్స్ అంగీకరించడం విశేషం. దీనితో మరి కొద్ది వారాలలొ ఈ Hammer Missils భారత అమ్ముల పొదిలొ చేరనున్నాయి

1 thought on “హిమాలయాల్లోని చైనా బంకర్లు బద్దలు కొట్టే సరికొత్త ఆయుధం భారత్ చేతుల్లోకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!