చైనా కు వంత పాడుతున్న హిందూ దినపత్రికపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

గత కొంత కాలంగా ఇంగ్లీష్ దినపత్రికయిన “The Hindu” చైనా కు వంత పాడుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలొ ఇది మరీ ఎక్కువైంది. పేరుకు జాతీయ పత్రికయినప్పటికీ, హిందూ పేపరు జతీయతను పూర్తిగా పక్కన పెట్టింది. అది ఎంతగా అంటే చైనా అంటే హిందూ పేపరు గుర్తొచ్చేంతగా హిందూ పేపరు తయారయింది.
క్రితం నెల అక్టోబరు 1 వ తేదీన — చైనా 71 వ స్వాతంత్రదినోత్సవం సంధర్బంగా హిందూ పేపరు ఒక పేజి మొత్తంలొ చైనా గొప్ప తనాన్ని తెలియజేస్తూ ఆర్టికల్స్ ప్రచురించింది. ఈ ఆర్టికల్స్ కు భారత్ లోని చైనీస్ ఎంబసీ స్పాన్సర్ చేసినట్టు తెలియడంతో —- హిందూ పేపరు పై అనుమానమొచ్చిన ముంబాయి కి చెందిన సమాజిక సంస్థ Legal Rights Observatory (LRO) వెంటనే ఈ విషయంపై స్పందించింది.
వెంటనే తరువాతి రోజు అనగా అక్టోబర్ 2 వ తారీకున ఈ విషయంపై కేంద్ర హోం మినిష్ట్రి కు కంప్లైంట్ చేసింది. అసలు హిందూ పేపరుకు, చైనా కు ఉన్న సంబందమేమిటి ???, హిందూ పేపరుకు, చైనా కు మధ్యనున్న ఆర్ధిక లావాదేవీలపై అనుమానముందని లీగల్ రైట్స్ అబ్జర్వేటరి స్పష్టంగా కేంద్ర హోం మినిష్ట్రీ కు హిందూ పేపరు పై పిర్యాదు చేసింది.
దీనితో స్పందించిన కేంద్ర హోంశాఖ, ఈ విషయాన్ని ఇన్కంటాక్స్ డిపార్టుమెంట్ కు పంపించి విచారణకు ఆదేశించింది. హిందూ పేపరుకు, చైనా కు మధ్యనున్న ఆర్ధిక లావాదేవీల అంశాన్ని దర్యాప్తు చేయమని ఐటి డిపార్టుమెంటును కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అంతేకాకుండా 30 రోజులలో అన్ని విషయాలు తెలియజేయాలని గడువు విధించింది. దీనితో హిందూ పేపరుకు, చైనాకున్న ఆర్ధిక లావాదేవీలు మొత్తం త్వరలొ బయటకు రానున్నాయి