చైనాకు షాకిచ్చేలా రాఫెల్ ఒప్పందం తరువాత ఫ్రాన్స్ తో మరో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్న భారత్

రక్షణ ఉత్పతులు, ఆయుధాల తయారీ విషయంలొ గత కొంత కాలంగా భారత్ ఎన్నడూలేనంత చురుకుగా పనిచేస్తుంది. ముఖ్యంగా గల్వాన్ ఘటన తరువాతి నుండి భారత్ ఆయుధాల తయారీ వేగాన్ని మరింత పెంచింది. ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశం ఉండటంతో అన్ని రకాల వ్యవస్థలను పుల్‌గేర్ లోకి తీసుకు రావడమే కాకుండా, కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు.

ఇందులో భాగంగానే భారత్, ఫ్రాన్స్ తో మరో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది. అదే స్టెల్త్ సబ్మెరైన్ల తయారీ ప్రాజెక్టు. ప్రాజెక్టు 75I లొ భాగంగా భారత్ ఆరు భారీ స్టెల్త్ సబ్మెరన్లను తయారు చేయాలని భావిస్తుంది. ఈ ఆరు సబ్మెరైన్లను మేకిన్ ఇండియా లొ నిర్మించాలని భారత్ నిశ్చయించింది. ఈ ప్రాజెక్టు విలువ ఏకంగా 5.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలు.

ఇందుకోసం జర్మనీకు చెందిన తైసెన్‌కృప్ మెరైన్ సిస్టమ్స్, రష్యా కు చెదిన రీబిన్ డిజైన్ బ్యూరొ, స్పెయిన్ కు చెందిన నవంటియ సంస్థ, ఫ్రాన్స్ కు చెందిన నావెల్ గ్రూఫ్ ను, దక్షిణ కొరియాకు చెందిన దేవో మెరైన్ ఇంజనీరింగ్ సంస్థలను ఎంపిక చేసింది. అయితే మారిన పరిస్తితుల దృష్ట్యా, ఫ్రాన్స్ తో భారత్ కున్న స్నేహ బంధం, అవసరాల దృష్ట్యా — ఈ భారీ ప్రాజెక్టుకు దాదాపుగా ఫ్రాన్స్ కంపెనీ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

భారత్ ను ఐక్యరాజ్యసమితిలొ, భద్రతా మండలి లొ పలుమార్లు ఆదుకున్న ఫ్రాన్స్ కే ఈ ప్రాజెక్టును కట్టబెట్టాలని మోది ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్తితులలొ చైనాకు దాదాపు 74 సబ్మెరైన్లు ఉండగా, భారత్ వద్దనున్న సబ్మెరైన్ల సంఖ్య కేవలం 15 మాత్రమే. దీనితో ఈ సబ్మెరైన్ల ప్రాజెక్టును భారత్ అతి త్వరలొ ప్రారంభించనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!