Big Blow To China : శ్రీలంకలో చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారత్

భారత్ ను అన్ని వైపుల నుండి దాడి చేసేందుకు వీలుగా, గత పదిహేను సంవత్సరాల నుండి చైనా వేగంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులొ భాగంగానే భారత్ కు అత్యంత కీలకమైన హిందూ మహా సముద్రంలోని ఇండియన్ నేవీ కదలికలను పసిగట్టేందుకు, శ్రీలంక ను మచ్చిక చేసుకుని, శ్రీలంక లొ నావెల్ బేస్ ను ఏర్పాటు చేయడానికి చైనా ప్యూహం రచించింది.
అందులొ భాగంగా శ్రీలంక కు 1.4 బిలియన్ డాలర్ల ఋణం ఇచ్చి, మరలా ఆ డబ్బుతోనే శ్రీలంకలోని హంబతోట లొ భారీ పోర్టు ను నిర్మించింది. అయితే ఆ పోర్టు ద్వారా వచ్చే ఆదాయం ఘోరంగా పడిపోవడంతో, చైనా అప్పును తీర్చలేని శ్రీలంక, విధిలేని పరిస్థితులలొ హంబతోట పోర్టు ను చైనాకు 99 సంవత్సరాలపాటు లీజుకివాల్సి వచ్చింది. సముద్ర వ్యాపారంలొ ఆరితేరిన చైనా, ఇక హంబతోట పోర్టు నుండి లాభాలను గడించడం ప్రారంభించింది. శ్రీలంక లోని ఇతర పోర్టులకు వచ్చే బిజినెస్ ను కూడా చైనా, హంబతోట కు మరలించి శ్రీలంక ను మరింత ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది.
ఈ విషయాలన్నింటినీ గమనించిన భారత్, శ్రీలంక కు స్నేహ హస్థాన్ని అందించింది. హంబతోట కు ధీటుగా కొలంబో పోర్టు లొ “East Container Terminal ను నిర్మించడానికి ముందుకు వచ్చింది. ఈ పోర్ట్ టెర్మినల్ ను నిర్మించడం వలన కొలంబో పోర్టు ద్వారా భారీ ఎత్తున బిజినెస్ జరగడమే కాకుండా, హంబతోట్ ద్వారా జరిగే వ్యాపారాన్ని తగ్గించడానికి భారత్ ప్రణాళికలు రచించింది. అంతేకాకుండా ఇక్కడి నుండి హంబతోట లొ చైనా నిర్వహిస్తున్న రహస్య కార్యకలాపాలాపాలు, కదలికలను పసిగట్టడానికి భారత్ ఈ ప్యూహాన్ని అమలు చేసింది.
ఫలితంగా శ్రీలంక ప్రభుత్వం ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. త్వరలొ ఈ పోర్టు కు సంబందించి శ్రీలంక, భారతదేశాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందం జరుగనుంది. కాగ ఈ డీల్ ను రద్దు చేయించడానికి చైనా విశ్వప్రయత్నం చేసినప్పటికీ, భారత్ ముందు చైనా ఆటలు సాగలేదు