లడఖ్ విషయంలో మరొక సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

లద్దాక్ మీద చైనా, పాకిస్థాన్లు కన్నేసిన సంగతి తెలిసిందే. అందుకొసమే లద్దాక్ ను భారత ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతమా మార్చింది. గత ఆరు నెలల కాలంగా లద్దాక్ ప్రాంతం విపరీతంగా వార్తలలోకి ఎక్కిన విషయం అందరికీ విధితమే. అందుకే ఈ ప్రాంతంలొ భారత ప్రభుత్వం దాదాపు లక్ష మంది సైనికులను మొహరించింది. అంతేకాకుండా ఇక్కడ అర్జున్ యుద్ధ ట్యాంకులతో పాటు ఆర్టిలరీ గన్స్ ను, బ్రహ్మాస్ మిసైల్స్ ను మొహరించింది.

అయితే ఇప్పుడు లద్దాక్ ను పూర్తిగా చైనా, పాకిస్థాన్ల రాడార్ నుండి తప్పించడం కోసం లద్దాక్ ను అతి పెద్ద టూరిస్టు ప్రాంతమా మార్చడానికి భారత ప్రభుత్వం నిశ్చయించింది. ఆసియాలోనే అతి పెద్ద టూరిస్టు హబ్ గా లద్దాక్ ను మార్చాలని మోది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే లద్దాక్ ను వింటర్ స్పోర్ట్ సెంటర్ గా తయారు చేయడానికి భారత ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ప్రపంచ దేశాల నుండి పెద్ద ఎత్తున టూరిస్టులను లద్దాక్ కు రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుంది.

ఇందుకోసం ముందుగా లద్దాక్ లొని కార్గిల్ జిల్లాలొ అతి పెద్ద Snow ski institute ను ఏర్పాటు చేస్తుంది. లద్దాక్ లొ ఈ వ్యవహారాన్నింటినీ పర్యవేక్షించడానికి, అమలు చేయడం కోసం ఇక్కడ అతి పెద్ద Snow ski institute ను నిర్మిస్తున్నారు. Institute of Skiing and Mountaineering (IISM) గా పిలువబడే ఈ ఇన్‌స్టిట్యూట్ ను కార్గిల్ జిల్లాలొ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఇకనుండి లద్దాక్ లొ టూరిజాన్ని అభివృధి చేయడం, స్కేటింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ లాంటి వాటితో పాటు ఐస్ హాకి లాంటి క్రీడలను కూడా ఇక్కడ ప్రారంభించనుండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!