చైనాకు మరొక అవకాశం ఇవ్వకుండా మాల్దీవులతొ భారత్ కీలక ఒప్పందాలు

మాల్దీవులు అధ్యక్షునిగా “అబ్దుల్లా యమీన్” ఉన్న సమయంలొ, యమీన్ ను పూర్తిగా లొంగదీసుకుని మాల్దీవుల లొ పాగా వేయడానికి చైనా విశ్వప్రయత్నం చేస్సిన సంగతి తెలిసిందే. ప్రధానంగా మాల్దీవుల లోని ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మాల్దీవులు మొత్తాన్ని తన గుప్పెటలొ పెట్టుకోవడానికి చైనా తీవ్రంగా ప్రయత్నించింది. భౌగోళికంగా మాల్దీవుల అత్యంత గొప్ప స్థానంలొ ఉండటంతో ఈ దేశం కోసం అటు చైన, ఇటు భారతదేశాలు పోటీపడ్డాయి.
దీనితో భారత్, అమెరికా సాయాన్ని తీసుకుని మాల్దీవుల లొ మరలా ఎన్నికలు నిర్వహించేలా చేసి అబ్ధుల్లా యామీన్ ప్రభుత్వాన్ని కూలదోసింది. తరువాత మాల్దీవుల లొ ఇబ్రహీం మొహమ్మద్ అధ్యక్షునిగా భారత అనుకూల ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో వెంటనే భారత్, మాల్దీవులలొ అభివృధి కార్యక్రమాలు, రక్షణ్ ఒప్పందాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే మాల్దీవిలతో దాదాపు ఐదు రక్షణ ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇక మాల్దీవుల లొ అభివృధి పనులపై దృష్టి పెట్టింది.
ఇందులొ భాగంగా భారత్, మాల్దీవులతో నాలుగు ఒప్పందాలు చేసుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా 50 సంవత్సరాల మాల్దీవుల కల అయిన Greater Male Connectivity Project (GMCP) ప్రాజెక్ట్ కు సంబందించిన కీలక ఒప్పందం భారత్ చేసుకుంది. ఇది మాల్దీవులు రాజధాని మలె ను ఈతర దీవులతో కలిపే అతి పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఖరీదు దాదాపు 500 మిలియన్ డాలర్లు కాగ భారత్ 100 మిలియన్ డాలర్లు ఉచితంగా ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.
అంతేకాకుండా మిగిలిన 400 మిలియన్ డాలర్లు ఋణం ఇవ్వడానికి కూడా భారత్, మాల్దీవుల తొ ఒప్పందం చేసుకుంది. దీనితో మాల్దీవులు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి మాల్దీవులు, భారత జాతీయ జెండాలు పట్టుకుని హర్షాతిరేకాలు తెలియజేయడం విశేషం. కాగ మాల్దీవుల లొ భారత్ త్వరలొ ఒక నావెల్ బేస్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మా పోస్టులు మీకు నచ్చినట్లయితే Please Support Us