అర్నాబ్ గోస్వామి అరెస్టు విషయంలొ మహారాస్ట్ర హోం మినిష్టర్ కు ఫోన్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం అర్నాబ్ గోస్వామి అరెస్టు. జాతీయవాది అయిన అర్నాబ్ గోస్వామిని 2018 కేసును బూచి గా చూపి తెల్లవారు జామున అత్యంతా పాశవికంగా ఈడ్చుకెళ్ళిన విషయం తెలిసిందే. అరెస్టయిన తరువాత తన ప్రాణాలకు ముప్పు ఉందని, తన కుటుంబ సభ్యులను కలవ నీయడం లేదని అర్నాబ్ గోస్వామి చెప్పడం అందరినీ కదిలించ్చింది

దీనితో వెంటనే మహారాస్ట్ర గవర్నర్ “భగత్‌సింగ్ కోష్యారి” నేరుగా రంగంలోకి దిగారు. వెంటనే మహారాస్ట్ర హోంమినిష్టర్ “అనీల్ దేశముఖ్” కు ఫోన్ చేసి అర్నబ్ గోస్వామి రక్షణ విషయాన్ని ప్రస్థావించారు, ఈ సంధర్బంగా అర్నాబ్ గోస్వామి రక్షణ విషయంలొ తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ “భగత్‌సింగ్ కోష్యారి, మహారాస్ట్ర హోం మినిష్టర్ ను ఆదేశించినట్టు తెలుస్తుంది. అర్నాబ్ ఆరోగ్య విషయమై గవర్నర్, అనీల్ దేశముఖ్ ను హెచ్చరినట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా వెంటనే అర్నాబ్ గోస్వామి ని తన కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాటు చేయమని హోం మినిష్టర్ ను ఆదేశించారు. వీలుంటే ఈ రోజే అర్నాబ్, తన కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాటు చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. కాగ అర్నాబ్ గోస్వామి సెక్యూరిటి దృష్ట్యా, అర్నాబ్ ను తలోజా జైలు కు తరలించారు.

మా పోస్టులు కనుక మీకు నచ్చినట్లయితే Please Support Us

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!