జమ్ముకాశ్మీర్ విషయంలొ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం, ఇక జాతీయవాదులదే హవా

జమ్ముకాశ్మీర్ విషయంలొ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్టికల్ 370 ను ఎత్తివేసి, కాశ్మీర్ ను పూర్తిగా భారత్ లొ కలిపివేసిన మోది ప్రభుత్వం ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
జమ్ముకాశ్మీర్ లోని తీవ్రవాదం మూలంగా అనేకమంది కాశ్మీరి ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాశ్మీరి పండితులు ఆ కోవకు చెందిన వారే. కాశ్మీర్ నుండి బయటకు వచ్చిన కాశ్మీరి పండిట్ల సంఖ్య దాదాపు రెండు లక్షలు గా ఉంది. అయితే వీరికి ఇప్పటి వరకు జమ్ముకాశ్మీర్ ఎన్నికలలొ ఓటు హక్కు లేదు.
కాని ఇప్పుడు కాశ్మీరి పండిట్లతో సహా, జమ్ముకాశ్మీర్ ను వదిలి వచ్చిన వారందరికీ, జమ్ముకాశ్మీర్ లొ ఓటు హక్కు కల్పుస్తూ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే దేశంలోని వివిధ ప్రాంతాలలొ ఉంటున్న జమ్మూకాశ్మీర్ ప్రజలందరికీ, జమ్మూ కాశ్మీర్ లొ ఓటు హక్కును కల్పించనున్నారు.
అంతేకాకుండా జమ్ముకాశ్మీర్ లొ నివసించడానికి ముందుకు వచ్చి, దొమిసిలి సర్టిఫికేట్ తీసుకున్న వారికి కూడా జమ్ముకాశ్మీర్ లొ ఓటు హక్కును కల్పిస్థూ మోది ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షల మంది జాతీయవాదులు ఇప్పటికే డొమిసిలి సర్టిఫికేట్ ను తీసుకున్నారు. ఇప్పటి వరకు డొమిసిలి సర్టిఫికేట్ ను తీసుకున్న వారి సంఖ్య దాదాపు ముప్పై లక్షలుగా ఉంది.
అంటే ఈ ముప్పై లక్షల మంది ప్రజలు ఇకనుండి జమ్ముకాశ్మీర్ లొ ఓటు వేయనుండటం విశేషం. మోది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బిత్తరపోయిన కాశ్మీర్ వేర్పాటువాద పార్టూలు తీవ్రస్థాయిలొ నిరసన తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా కాశ్మీరులొ త్వరలొ జరుగబోయే ఎన్నికలలొ, తమ ఓట్లు చీలిపోకుండా తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నేషనల్ కాంఫ్రెన్స్, PDP పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది
మా పోస్టులు మీకు నచ్చినట్లయితే Please Support Us
We knowing truth thank you
Good super duper ur chennal