“రామాయణం” గురించి కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

బ్రిటన్, భారత్ ను దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా పాలించిన దేశం. నిన్నా మొన్నటి వరకు భారతదేశమన్నా, భారతీయ సంస్కృతి అన్నా బ్రిటన్ చిన్న చూపు చూస్తుండేది. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు విలువ, గౌరవాన్ని ఇవ్వడం ప్రారంభించారు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మరలా యురోపియన్ దేశాలలొ విజృంభిస్తుంది. బ్రిటిన్ ప్రధాని కూడా కరోనా సోకడంతో, దాదాపు మృత్యువు అంచుల దాకా వెళ్ళి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరలా రెండవసారి బ్రిటన్ లొ కోవిడ్ విజృంభించడం ప్రారంభించింది. దీనితో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరలా బ్రిటన్ లొ “లాక్డౌన్” విధించారు
ఈ సంధర్బంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ — తాము కోవిద్ ను రామాయణంలొ శ్రీరాములవారు, సితమ్మ వారు ఎలాగయితే రావణుడిని ఓడించారో అలాగే తాము కూడా కోవిద్ ను ఓడిస్థామని తెలియజేశారు. రావణుడిని ఓడించడానికి ఎలాగయితె శ్రీరాముడు, సీతాదేవి పోరాడారో అలాగే తాము కరోనా పై యుద్ధం చేస్థామని పేర్కొనడం విశేషం. ఒక బ్రిటన్ ప్రధాని ఈ విధంగా భారతీయ సంస్కృతి కి చెందిన అంశాల గురించి పేర్కొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం
మా పోస్టులు మీకు నచ్చినట్లయితే Pleasse Support Us
Good