చైనా మతిపోయేలా, కీలక వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని “ఓలి”

గత కొంత కాలం నుండి హిమాలయ రాజ్యమైన నేపాల్ ను తమవైపు తిప్పుకోవడం కోసం అటు చైనా, ఇటు భారత్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. భౌగోళికంగా భారత్, చైనా ల మధ్యనున్న నేపాల్, ఇరు దేశాలకు ప్యూహాత్మకంగా మరిపోయింది. దీనితో భారత్ పైకి నేపాల్ ను రెచ్చగొట్టడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తూఉంది
అయితే గత కొంత కాలంగా నేపాల్ ప్రధాని ఓలి, చైనా ప్రలోభాలకు లొంగి పోయిన సంగతి తెలిసిందే. చివరికి చైనా ఆదేశం మేరకు నేపాల్ కొత్త మ్యాప్ ను తయారుచేసి అందులొ భారత భూభాగాలైన కాలాపని, లిపులేక్, లింపియాదుర ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపిస్థూ నేపాల్ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. అలాచేస్తే భారత్ రెచ్చిపోయి, నేపాల్ పై విరుచుకు పడుతుందని, అప్పుడు ఆటోమెటిక్ గా భారత్ కు నేపాల్ దూరమవుతుందనేది చైనా దుష్ట పన్నాగం.
అయితే ఈ విషయాన్ని ముందుగా పసిగట్టిన భారత్, నేపాల్ కొత్త మ్యాప్ గురించి పెద్దగా స్పందించలేదు, అసలు పట్టించుకోనట్టు వ్యవహరించింది. అంతేకాకుండా అప్పటి నుండి నేరుగా ఓలి ప్రభుత్వంతో తెరవెనుక మంతనాలు ప్రారంభించింది. దీనితో అప్పటి వరకు భారత్ పై విరుచుకు పడిన నేపాల్ ప్రధాని ఓలి నెమ్మదిగా మెతక పడటం ప్రారంభించాడు. ఇందులొ భాగంగా పోయిన నెలలొ నెపాల్ పర్యటనకు వెళ్ళిన ఇండియన్ RAW చీఫ్ సమంత్ గోయల్ ను కలిసిన వెంటనే, నేపాల్ ప్రధాని ఓలి భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరించాడు
ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చీఫ్ నారవణె ను కలిసిన వెంటనే నేపాల్ ప్రధాని ఓలి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో నేపాల్ ప్రత్యేక సంబందాలు కలిగి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ కు నేపాల్ కు మద్య గొప్ప సంబందాలున్నాయని, ఈ బంధం శాశ్వతమైనదని ఓలి పేర్కొనడం విశేషం. ఇది ఖచ్చితంగా చైనాకు మింగుడుపడని అంశమే. గత కొంత కాలంగా నేపాల్ లొ వందల కొట్లు పెట్టుబడులు పెట్టిన చైనాకు ఓలి వ్యాఖ్యలు శరాఘాతంగా తగలనున్నాయి
మీకు మా పోస్టులు నచ్చినట్లయితే Please Support Us
Good job