చైనానే టార్గెట్ గా — జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి సరికొత్త ప్యూహానికి తెరలేపిన భారత్

India's Prime Minister Narendra Modi and Japan's Prime Minister Shinzo Abe stand before an honour guard ahead of a meeting at Abe's official residence in Tokyo on October 29, 2018. (Photo by Kiyoshi Ota / POOL / AFP) (Photo credit should read KIYOSHI OTA/AFP via Getty Images)

ప్రస్తుత పరిస్తితులలొ అనేక ప్రపంచ దేశాలకు చైనా ఉమ్మడి శత్రువుగా మారిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్ దేశాలకు చైనా ఆగర్బ శత్రువుగా మారింది.

గల్వాన్ ఘటనతొ భారత్ కు శత్రువు కాగ, శంఖాకు దీవుల విషయంలొ జపాన్ కు శత్రువుగా మారింది. అలాగే తమ దేశం నుండి టెక్నాలజీను దొంగిలించడంతో ఆస్ట్రేలియా కు చైనా శత్రువుగా మారింది.

దీనితో ఇదే అదనుగా భావించిన భారత్, చైనాకు వ్యతిరేకంగా జపాన్, ఆస్ట్రేలియాలతొ ప్రత్యేకంగా trilateral engagement ను భారత్ ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్దేశ్యం చైనా కు కీలమైన వ్యాపార వాణిజ్యాలను దెబ్బకొట్టడం, రెండవది చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం.

ఇందులొ భాగంగా చైనా నుండి అత్యధికంగా దిగుమతి చేసుకునే పది ఉత్పత్తులను గుర్తించారు. అందులొ బల్క్ డ్రగ్స్, ఫార్మాసుటికల్స్, మెడికల్ డివైజెస్, ఆటో కాంపోనెంట్స్, పెట్రోకెమికల్స్, స్టీల్, ఐటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి.

ఇకనుండి ఈ ఉత్పత్తులను చైనా నుండి దిగుమతి చేసుకోకుండా భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలలోనే ఆయా ఉత్పత్తుల తయారీ ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం మూడు దేశాలు ప్రత్యేక పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేయనున్నాయి.

నిజానికి ఈ ఆలోచన జపాన్ ది అయినప్పటికీ, భారత్ కే ఎక్కువ లాభదాయకం కావడంతో, ఈ విషయంలొ మోది ప్రభుత్వం చొరవ తీసుకుని వడివడిగా అడుగులేస్తుంది

మీకు మా పోస్టులు నచ్చినట్లయితే Please Support Us

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!