తమిళనాడుపై గురిపెట్టిన మోదీ,మరో బారీ సమిట్.

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

తమిళనాడు మరో భారీ ఈవెంట్ కు సిద్ధమవుతుంది. మొన్నీమధ్యనే తమిళనాడులొని మహాబలిపురంలొ చైనా అధ్యక్షుడు క్సింపింగ్, భారత ప్రధాని మోది గారి మధ్య చారిత్రాత్మక ఇన్‌ఫార్మల్ సమిట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమిట్ లొ భారత్ చెప్పుకోతగ్గ ఫలితాలు రాబట్టడంతోపాటు, ఈ కార్యక్రమం సూపర్ హిట్ ఆయ్యింది. అంతేకాకుండా తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసినట్లయింది.

అలాంటి మరో భారీ సదస్సుకు మరొకసారి తమిళనాడు వేదిక కానుంది. అదే భారత్_జపాన్ దేశాల హైలెవల్ డెలిగేషన్ సమిట్. డిసెంబర్ నెలలొ జరుగనున్న ఈ హైలెవల్ డెలిగేషన్ సమిట్ కు జపాన్ ప్రధాని “షింజో అబే” ముఖ్య అతిధిగా రానున్నారు. జపాన్ లోని టాప్ పారిశ్రామిక వేత్తలతో షింజో అబే ఈ సమిట్ లొ పాల్గొననున్నారు.

అలాగే భారత్ వైపు నుండి ప్రధాని మోది గారు భారతీయ పారిశ్రామికవేత్తలతో ఈ సమిట్ లొ పాల్గొననున్నారు. ముఖ్యంగా తమ పెట్టుబడులకు జపాన్ తమిళనాడు పై ఏక్కువ ఆసక్తి చూపుతుండటంతో, తమిళనాడులోనే ఈ సమిట్ జరిగే అవకాశమున్నట్టు డిల్లీ వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా టొక్యో, చెనై నగరాల మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు

డిసెంబర్ 15 వ తారీకున జరిగే ఈ హైలెవల్ డెలిగేషన్ సమిట్ లొ భారత, జపాన్ దేశాలు వ్యాపార వాణిజ్యాలతో పాటు ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ట్రైలేటరల్ మిలటరీ ఏక్సరసైజ్, స్పేస్ కోఆపరేషన్, ఇండో ఫసిఫిక్ రీజియన్, మౌళిక సదుపాయాల కల్పనపై ఒప్పందాలు చేసుకోనున్నారు. అలాగే భారత్ నుండి తమ టూరిజాన్ని అభివృద్ధి చేసుకోవడానికి జపాన్ బాలిఉడ్ పై ఆసక్తి చూపుతుంది. కాగ తమ పెట్టుబడులను చైనా కు బదులుగా భారత్ లొ పెట్తాలని జపాన్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!