చైనీస్ యుద్ధ విమానాలకు చెక్. సరికొత్త ఆయుధాలను రంగంలొకి దింపనున్న భారత్

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ఆస్ట్రేలియాలొ అమెరికాకు చెందిన F-35 ఫైటర్ టెక్నాలజిను కొట్టేసిన చైనా వేగంగా యుద్ధ విమానాలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులొ భాగంగానే చైనా J-20 ఫైటర్లను తయారు చేసింది. ఈ తయారు చేసిన J-20 ఫైటర్లను Line of Actual Control (LAC) పొడవునా చైనా మొహరించింది. కేవలం భారత్ ను దృష్టిలొ పెట్టుకుని భారత సరిహద్దు ప్రాంతాలైన  టిబెట్, క్సింజియాంగ్ లలొ చైనా ఏడు ఏయిర్ బేస్ లను నిర్మించింది. ఏ క్షణంలోనైనా భారత్ పై దాడి చేసేందుకు J-20 లను సిద్దంగా ఉంచింది.

అయితే చైనీస్ యుద్ధ విమానాలే లక్ష్యంగా భారత్ మరో సరికొత్త ఆయుధాలను బరిలొకి దింపుతుంది.  అవే K30 Biho. ఇవి  self-propelled anti-aircraft weapons.  ఇది 360 డిగ్రీల కోణంలొ తన చుట్టూ తాను తిరగగలిగే షార్ట్ రేంజ్ ఏయిర్ డిఫెన్స్ సిస్టం. ఇది 10 కిలోమీటర్ల ఏత్తులొ ఏగిరే ఏటువంటి యుద్ధ విమానానైనా బద్దలు కొట్టగల సత్తా వీటి సొంతం. ఇవి రెండు రకాల ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంటాయి కావడంతో టార్గెట్ ఖచ్చితంగా దొరుకుతుంది. వీటి ఆపరేషనల్ రేంజ్ ఏకంగా 500 కిలోమీటర్లు. ఈ ఆయుధాల వేగం గంటకు 60 కిలోమీటర్లు. కాగ యుద్ధ రంగంలొ,  ముందు వరుస సైనికులను గొప్పగా కాపాడగల సత్తా ఉన్న ఆయుధమే ఈ K30 Biho.

Flying Tigers గా పిలవబడే ఈ K30 Biho ల కోసం దక్షిణ కొరియాతొ భారత్ ఒప్పందం చేసుకోనుంది. మొత్తంగా 104 భియో సిస్టంసును, 97 అమ్యునేషన్ క్యారియర్లను, 39 కమాండ్ వెహికల్స్ ను భారత్ కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 2.6 బిలియన్ డాలర్లు. కాగ 2020 కొత్త సంవత్సరంలొ సరి కొత్తగా ఈ ఒప్పందాన్ని భారత్_దక్షిణకొరియా లు చేసుకోనుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!