ఇమ్రాన్‌ఖాన్ కు రోజులు దగ్గర పడ్దాయా ?? వేగంగా మారుతున్న పరిణామాలు

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

పాకిస్థాన్ లొ జరుగుతున్న పరిస్తితులు చూస్తుంటే ఇమ్రాన్‌ఖాన్ త్వరలొ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ లొ ఇమ్రాన్‌ఖాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్‌ఖాన్ పరిపాలనపై పై పాకిస్థాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. సరిగ్గా ఈ అవకాశాన్నే ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి.

ఇమ్రాన్‌ఖాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ “జామియత్ ఉలేమా ఇస్లాం ఫజల్” పార్టీ అధ్యక్షుడు “మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్” ఆద్వర్యంలొ నిర్వహించిన “ఆజాద్ మార్చ్” కు విశేష స్పందన లభించింది. దక్షిణ సింధ్ ఫ్రావిన్స్ నుండి ఇస్లామాబాద్ వరకు ఐదు రోజుల పాటు జరిగిన “ఆజాద్ మార్చ్” లొ ప్రజలు పెద్ద ఏత్తున పాల్గొని ఇమ్రాన్‌ఖాన్ కు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసిరాగా, పాకిస్థాన్ లొ అత్యంత శక్తివంతమైన మత పెద్ద కూడా పాల్గొని ఇమ్రాన్‌ఖాన్ కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు.

ఈ సంధర్బంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న “జామియత్ ఉలేమా ఇస్లాం ఫజల్” పార్టీ అధ్యక్షుడు “మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్” మాట్లాడుతూ ” ఇమ్రాన్‌ఖాన్ 2018 ఏన్నికలలొ రిగ్గింగు చేసి గెలిచాడని, ఇమ్రాన్‌ఖాన్ కేవలం ఆర్మీ చేతిలొ బొమ్మ మాత్రమేనని విరుచుకు పడ్డారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయిన దగ్గరి నుండి పాకిస్థాన్ తీవ్ర క్షామంలొకి కూరుకుపోయిందని, దేశంలొ ఏక్కడ చూసినా ఆకలి, దరిద్రం కొట్టుమిట్టడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా రక్షణ రంగంలోనూ పాకిస్థాన్ ఘోరంగా విఫలమైందని, ఇమ్రాన్‌ఖాన్ ఏట్టి పరిస్తితులలొ 48 గంటలలోగా రాజీనామా చేయాలని గడువు విధించారు. 48 గంటలలొ ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా చేయకపోతే దేశంలొ తీవ్ర పరిస్తితులు ఏర్పడతాయని వార్నింగ్ ఇచ్చారు. కాగ ఈ విషయంలొ ఇమ్రాన్‌ఖాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షలన్నీ ఏకతాటిపైకి రావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!