అగ్రరాజ్యాల స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్, సౌది అరేబియా తో మరో అగ్రిమెంట్!

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

నిన్నా మొన్నటి వరకు సౌది అరేబియా డిఫెన్స్ రంగంలొ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలపై ఏక్కువగా ఆధారపడేది. అలాగే సౌది అరేబియా ఆర్మీ కు కావలసిన ట్రైనింగ్ ను, చిన్న చిన్న రక్షణ పరికరాలను (అమెరికా సహాయంతో తయారు చేసినవి) పాకిస్థాన్ అందించేది. దీనితొ పాటుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సౌది అరేబియాతొ కలిసి పెద్ద ఏత్తున మిలటరీ ఏక్సరసైజులను పాకిస్థాన్ నిర్వహించేది. తద్వారా సౌది అరేబియా నుండి పెద్ద ఏత్తున నిధులను పాకిస్థాన్ పిండుకునేది. ఐతే గత ఐదు సంవత్సరాల కాలంలొ పాకిస్థాన్ బండారం బయటపడింది. . సరిహద్దుల వద్ద తరచుగా ఇండియన్ ఆర్మీ ధాటికి తట్టుకోలేక పారిపోతుండటం, తెల్ల జెండాలు చూపడం సంబందిత వార్తలు అంతర్జాతీయ మీడియాలొ ప్రముఖంగా రాసాగాయి. అలాగే భారత్ ఎటువంటి ఆటంకమూ లేకుండా పాకిస్థాన్ లొ సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టిలరీ స్ట్రైక్స్, ఏయిర్ స్ట్రైక్స్ నిర్వహించడంతో పాకిస్థాన్ ఆర్మి బలం ఏపాటిదో ప్రపంచానికి తెలిసింది. పాకిస్థాన్ ఆర్మీ డొల్ల తనం ప్రపంచానికి తెలిసింది. అలాగే భారత్ బలమేమిటో కూడా ప్రపంచానికి తెలిసింది.

మరొక పక్క అగ్ర రాజ్యాలు తమ రక్షణ ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. దీనితో ఏక్కువకాలం అగ్రరాజ్యాల మీద ఆధారపడలేమని భావించిన సౌది అరేబియా, డిఫెన్స్ విషయంలొ రూటు మారుస్తుంది. భారత్ తొ రక్షణ ఒప్పందాల కోసం సౌది అరేబియా తహతహలాడుతుంది. ఇందులొ భాగంగానే వచ్చే సంవత్సరం నుండి భారత్_సౌది్అరేబియా దేశాల మధ్య చరిత్రలొనే మొట్టమొదటి నావెల్ ఏక్సరసైజ్ ను నిర్వహించనున్నారు. అలాగే ఇరు దేశాలు white shipping information-sharing agreement చేసుకోనున్నాయి. వీటితో పాటుగా భారత్ నుండి మిలటరీ గ్రేడ్ వెహికల్స్ ను, లాజిస్టిక్స్ ను, ఇతర పరికరాలను సౌది అరేబియా కొనుగోలు చేయనుంది.

అన్నిటికంటే ముఖ్యంగా అరేబియా సముద్రం నుండి పర్షియన్ గల్ఫ్ వరకు సముద్ర రక్షణ భాధ్యతలు ఇరు దేశాలు కలిసి నిర్వహించాలని నిర్ణయించడం అతి పెద్ద విషయం. ఇది పాకిస్థాన్, చైనా లకు ఊహకందని విషయం. కాగా వచ్చే సంవత్సరం నుండి ఇరు దేశాల మధ్య ఈ రక్షణ ఒప్పందాలు అమలులోకి రానున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!