త్వరలొ ప్రారంభం కానున్న అయొద్య రామ మందిర నిర్మాణం !!!

Share the Post

#Bharatjago : దాదాపు ఇరవైఅయిదు సంవత్సరాల నుండి పెండింగు లొ ఉన్న, కొట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని జన్మస్థలమైన అయొద్య రామమందిరం నిర్మాణం త్వరలొ ప్రారంభంకానునట్టు తెలుస్తుంది …. ఈ విషయాన్ని సాక్ష్యాత్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు “అమిత్ షా” గారే నిన్న జరిగిన సమావేశంలొ వెల్లడించినట్టు తెలుస్తుంది.

అయొద్య లొ రామమందిరం నిర్మాణం త్వరలొ ప్రారంభంకానుందని, అమిత్ షా గారు స్పష్టం చేసినట్టు తెలంగాణా ను చెందిన బిజెపి నేషనల్ ఏక్సిక్యుటివ్ మెంబర్ “పేరాల చంద్రశేఖర్” గారు నిన్న జరిగిన విలేఖరుల సమావేశంలొ తెలియజేశారు. నిన్న హైదరాబాదు వచ్చిన అమిత్ షా గారితొ సమావేశమైన పేరాల చంద్రశేఖర రావు గారు,  ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, త్వరలొనే రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని , స్వయంగా అమిత్ షా గారే ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఆయన తెలియజేశారు.  త్వరలొనే రామ మందిరం నిర్మాణం ప్రారంభంకానున్నట్టు తామంతా గట్టిగా నమ్ముతున్నామని ఆయన తెలియజేశారు.

కాగ నిన్న ఒక రొజు పర్యటన కొసం తెలంగాణా వచ్చిన అమిత్ షా గారు అనేక కార్యక్రమాలలొ పాల్గొన్నారు. ముందుగా రాస్ట్రీయస్వయంస్వవక్ సంఘ్, VHP నేతలతొ అమిత్ షా గారు ప్రత్యేకంగా సమావేశమైనారు. తరువాత బిజెపి పార్టీ ఆఫీసులొ పార్టీ నాయకులతొ సమావేశమైన అమిత్ షా గారు, బిజెపి నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలుస్తుంది. రాస్ట్రంలొ అవకాశాలు ఉన్నప్పటికీ బిజెపి తెలంగాణా మాత్రం ఉన్నచొట నుండి కదలడం లేదని, ఏటువంటి ప్రజా పొరాటాలు చేయడం లేదని అమిత్ షా గారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా స్వామిపరిపూర్ణానంద స్వామీని జీ ను నగర బహిష్కరణ చేయడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్తు తెలుస్తుంది. ఈ విషయం పై టి.అర్.యస్ ప్రభుత్వాన్ని ఏందుకు నిలదీయలేదని బిజెపి నాయకులను ప్రశ్నించారు. పార్టీ మార్గదర్శకాలను కాకుండా, సొంత ఏజెండాతొ ఏలా పనిచేస్థారని స్థానిక నాయకత్వంపై అమిత్ షా గారు మండి పడ్దారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!