ఏట్టకేలకు అలక మానిన డొనాల్డ్ ట్రంప్, సెప్టెంబరులొ భారత్_అమెరికాల మద్య 2+2 మెగా డీల్ 💪

Share the Post

.

#Bharatjago : ఏట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలక మానాడు.  దీనితొ పొయిన నెలలొ వాయిదా పడ్ద “2+2 డైలాగ్” మరలా పట్టాలకెక్కింది. వచ్చే నెల మొదటి వారంలొ అమెరికా_భారతదేశాల మద్య అతి పెద్ద “2+2 డైలాగ్ మెగా డిఫెన్స్ అగ్రిమెంట్” జరగనుంది. ఇందులొ అత్యంత కీలకమైన నాలుగు రక్షణ ఓప్పందాలు ఉండటం విశేషం. ఈ డీల్ భారతదేశ మిలటరీ సామర్ధ్యాన్ని 3 రెట్లు పెంచగలదు.

విషయంలొకి వస్తే : 2016 లొనే అమెరికా, భారత్ ను అతి పెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తించింది. ఇందులొ భాగంగా  భారతదేశ మిలటరీ సామర్ధ్యాన్ని పెంచేందుకు వీలుగా భారత్ కు, ప్రపంచంలొనే అత్యంత శక్తి వంతమైన ఉన్నతమైన ప్రిడేటర్ ద్రొణ్ల ను, అణుసామర్ధ్యం ఉన్న విమానవాహక నౌకల టెక్నాలజీ (ఈ టెక్నాలజీ చాలా చాలా అరుదు), F-16, F-18 యుద్ధ విమానాలను భారత్ (Make In India) లొనే  తయారుచేస్తూ, ఈ టెక్నాలజీ ను భారత్ కు అమెరికా బదలాయించేలా 2017 లొ నరేంద్రమోది_డొనాల్డ్ ట్రంప్ లు ఒక అంగీకారానికి వచ్చారు.  నిజానికి ఈ డీల్ భారత్ కు బంగారంతొ సమానం. ఇవన్నీ కూడా ప్రపంచంలొ అత్యుత్తమైన టెక్నాలజీ తొ తయారు చేయబడినవే.

ఈ మెగా డీల్ కు సంబందించి ఇరు దేశాల మద్య చర్చలు పూర్తయిన తరువాత, ఈ నెల 5 వ తారీకున ఇరు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు కలిసి ఈ ఓప్పందాలను చేసుకొవడానికి నిర్ణయించారు (దీనినే 2+2 డైలాగ్ అంటారు). అయితే ఈ మద్య కాలంలొ అమెరికా, భారత దేశాల మద్య వాణిజ్యానికి సంబందించి గొడవలు జరగడం, రష్యా_ఇరాన్ దేశాల విషయంలొ అమెరికా ఆంక్షలను భారత్ లెక్కచేయకపొవడంతొ, ఇరు దేశాల మద్య అగాధం ఏర్పడింది. దీనితొ అలక బూనిన ట్రంప్ ఈ నెల 5 వ తారీకున జరగాల్సిన ఈ డీల్ ను ముందుగానే క్యాన్సిల్ చేశాడు.

అయితే గత రెండు వారాలుగా మరలా మరలా భారత ప్రభుత్వం, అమెరికా తొ చర్చలు, సంప్రదింపులు జరిపి  ఏట్తకేలకు డొనాల్డ ట్రంప్ ను ఓప్పించగలిగారు. దీనితొ వచ్చే నెల సెప్టెంబర్  మొదటి వారంలొ భారత్_అమెరికా దేశాల మద్య 2+2 డైలాగ్ జరగనుంది. ఈ మెగా అగ్రిమెంట్ పూర్తయినట్లయితే, ఆసియా లొ భారత్ ను ఏదిరించగలిగే దేశమే ఉండదు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!