భారత్ పై తప్పుడు నిందలు మొపిన పాకిస్థాన్ కు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన “అమెరికన్ రక్షణ మంత్రి”

Share the Post

.

#Bharatjago : భారత్ పై నిందలు మొపడం, నేరాలు చెప్పడం పాకిస్థాన్ కు వెన్నతొ పెట్టిన విద్య అన్న సంగతి తెలిసిందే.  ప్రతి అంతర్జాతీయ వేదికపై భారత్ పై అబాండాలు మొపడం పాకిస్థాన్ చేసే మొదటి పని. అయితే ఈసారి కూడా అదే పని చేసిన పాకిస్థాన్ కు గట్టి PUNCH పడింది. అది కూడ సాక్ష్యాత్తూ అగ్రరాజ్యమైన అమెరికన్ రక్షణ మంత్రి నుండి కావడం విశేషం.

విషయంలొకి వస్తే, అమెరికన్ రక్షణ మంత్రి “జిం మేటిస్”,  ముఖ్య అతిధిగా పాల్గొన ఒక్క అంతర్జాతీయ సదస్సుకు పాకిస్థాన్ కూడా అటెండ్ అయ్యింది. ఈ సదస్సుకు పాకిస్థాన్ తరపున హాజరయిన “Think tank ” మాట్లాడుతూ …. “అమెరికాకు దక్షిణాసియాలొ శాంతి, స్తిరత్వం స్థాపించాలని ఏంతొ పట్టుదలతొ ఉందని, అందుకుతగ్గ కృషి చేస్తుందని, అందువలననే దక్షిణాసియాలొ అణ్వాయుధ ఉద్రిక్తత చాలా వరకు తగ్గిందని” మొదట అమెరికాను మునగ చెట్టు ఏక్కించారు.

తరువాత మాట్లాడుతూ “కాని భారతదేశం ఈ మద్య కాలంలొ హిందూ మహా సముద్ర ప్రాంతాన్ని అణ్వాయుధీకరణ, సైనికీకరణ చేస్తుందని …. ఇందులొ భాగంగానే భారత్   బ్రహ్మస్ , అరిహంత్ వంటి అణాయుధ సామర్ధ్య మున్న మిసైల్స్ ను తయారు చేసిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా అఫ్గనిస్థాన్ లొ శాంతి స్థాపనకు భారత్ విఘాతం కలిగిస్తుందని, అసలు ఆఫ్గనిస్థన్ లొ భారత్ పాత్రేమిటని” ఆయన్ అమెరికన్ రక్షణ మంత్రి జిం మేటిస్ ను ప్రశ్నించారు.

ఇందుకు సమాధానంగా జిం మేటిస్ మాట్లాడుతూ ” ఇండియా, ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి, వ్యాపారం అభివృధి చెందడానికి గొప్ప పాత్ర పొషిస్తుంది. ముఖ్యంగా తీవ్రవాదం విషయంలొ స్పష్టమైన వైఖరిని అవలంబిస్తుంది. కష్టతరమైనప్పటికీ తీవ్రవాదాన్ని తగ్గించడానికి నాగరికతాపరమైన ఆలొచనలతొ ముందుకు వెళుతుంది. నేను భారత్ చేస్తున్న కృషిని ఇష్టపడుతున్నాను, నేను భారత్ కు సపొర్టు చేస్తున్నాను. భారత్, ఆఫ్గనిస్థాన్ అభివృధిలొ కీలక పాత్ర పొషిస్తుంది. మేము (అమెరికా) ఈ విషయంలొ భారత్ కు మరింత తొడ్పాటునందిచాల్సి ఉంది” అంటూ పాకిస్థాన్ కు దిమ్మతిరిగే సమాధానమిచారు.

ఒక అమెరికా రక్షణ మంత్రి నుండి భారత్ కు, ఒక అంతర్జాతీయ వేదిక పై ఇంత బలమైన మద్దత్తు వస్తుందని పాకిస్థాన్ అసలు ఊహించలేదు …  పైగా పాకిస్థాన్ పరువు పొగొట్తుకున్నట్లయింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!