Great News : అతి ఏక్కువ నిరుపేదలున్న దేశం స్థానం నుండి వైదొలగిన భారత్.

Share the Post

.

#Bharatjago : నిరుపేదలు అత్యధికంగా ఉన్న దేశాలలొ ఇప్పటి వరకు మొదటి స్థానంలొ ఉన్న భారత్, ఇప్పుడు ఆ స్థానం నుండి రెండవ స్థానానికి ఏగబాకింది. అత్యధిక పేదరికం ఉన్న ప్రజల సంఖ్య ను భారత్ వేగంగా తగ్గించుకుంటూ రెండవ స్థానికి చేరుకుందని, భారత్ లొ ప్రతి నిమిషానికి 44 మంది భారతీయులు తీవ్ర పేదరిక నుండి బయట పడుతున్నారని World Poverty Clock నివేదిక వెల్లడించింది.

2016 నాటికి 124 మిలియన భారతీయులు తీవ్ర పేదరికంలొ ఉండగా, 2018 జూన్ నాటికి ఆ సంఖ్య 70.6 మిలియన్లకు చేరుకుందని తెలియజేసింది. భారత్ ఇవే విధానాలను అమలు చేసినట్లయితే 2022 నాటికి భారత్ లొ తీవ్ర పేదరికం అనుభవిస్తున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలొ 15 మిలియన్లకు తగ్గుతుందని ఈ రిపొర్టు వెల్లడించింది. ప్రస్తుతం భారత్ లొ 5% మంది ప్రజలు తీవ్ర పేదరికం అనుభవిస్తుండగా, 2021నాటికి ఈ సంఖ్య కేవలం 3% చేరనుందని World Poverty Clock తెలియజేసింది.

.

.

కాగా ప్రస్తుతం ప్రపంచంలొ అత్యధికంగా నిరుపేదలున్న దేశంగా నైజీరియా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం నైజీరియా లొ ఖటిక దరిద్రం అనుభవిస్తున్నవారి సంఖ్య 87 మిలియన్లకు చేరుకుందని World Poverty Clock  తెలియజేసింది. నైజీరియాలొ దాదాపు 44% మంది ప్రజలు తీవ్ర పేదరికలొకి కూరుకుపొయారని ఈ నివేదిక వెల్లడించింది.  నైజీరియా ప్రజల సంపాదన రొజుకు సగటున కేవలం 129 రూపాయల మాత్రమే సంపాదిచగలుతున్నారని ఈ సర్వే పేర్కొంది … (sources : Washington Post)

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!