కేరళ పాస్టర్లకు గట్టి ఏదురు దెబ్బ, అంగీకరించని హైకొర్ట్

Share the Post

.

#Bharatjago : కేరళలొని అత్యంత ప్రసిద్ధి చెందిన మలంకార ఆర్ధొడాక్స్ చర్చిలొ పాస్టర్లకు, కేరళ హైకొర్టు నుండి గట్టి ఏదురుదెబ్బ తగిలింది. అత్యాచారం కేసులొ,  మలంకార చర్చి పాస్టర్లకు ముందుస్ఠు బెయిల్ ఇవ్వడానికి హైకొర్ట్ నిరాకరించింది.

విషయంలొకి వస్తే, మలంకార ఆర్ధొడాక్స్ చర్చిలొ పని చేసే ఒక పెళ్లైన యువతిని, అదే చర్చి లొ పనిచెసే పాస్టర్ “జాబ్ మ్యాథ్యూ” అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ దృస్యాలను కెమేరా ద్వారా చిత్రీకరించి, ఆమెను బెరించసాగాడు. దీనితొ ఆ యువతి, జాబ్ మ్యథ్యూ నుండి తనను కాపాడమని, ఆ చర్చి లొ పనిచేసే మరొక పాస్టర్ వద్దకు వెళ్లింది. అయితే ఆ పాస్టర్ ఆమెకు సహాయం చేయకపొగా, అతను కూడా అమెను లైంగికంగా వాడుకొవడం ప్రారంభించాడు.

ఇలా ఒకరి నుండి ఒకరుగా మొత్తం ఐదుగురు పాస్టర్లు ఆమెపై 380 సార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలి భర్త తెలియజేశాడు. ముందుగా ఈ కేసును స్వీకరించడానికి అంగీకరించని పొలీసులు, తరువాత జాతీయ మహిళా కమీషన్ ఈ కేసును సుమొటాగా స్వీకరించడంతొ, తప్పని పరిస్తితులలొ కేరళ పొలీసులు ఈ కేసు ఫైల్ చేసి, విచారణ ప్రారంభించారు.

ఈ కేసును విచారిస్తున్న IG శ్రీజిత్ మాట్లాడుతూ, భాదితురాలిపై అత్యాచారం జరిగిన మాట వాస్థవమేనని, మొత్తం ఐదుగురు పాస్టర్లు అత్యాచారం చేయగా, బాధితురాలు నలుగురుని మాత్రమే గుర్తుపట్టిందని తెలిపారు. ఆ నలుగురు పాస్టర్లైన అబ్రహం వర్గేసి, జాబ్ మేథ్యూ, జాన్సన్ మేత్యూ, జైసీ జార్జ్ లపై కేసు ఫైల్ చేసారు.

అయితే ఈ నలుగురు పాస్టర్లలొ ముగ్గురు, తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కేరళ హైకొర్టులొ వేసిన బైలు పిటీషన్ వేయగా,  ఈరొజు ఈ కేసును విచారించిన కేరళ హైకొర్ట్  వారి బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. పాస్టర్లకు బెయిల్ ఇచ్చేందుకు హైకొర్టు నిరాకరించింది. దీనితొ ఆ నలుగురు పాస్టర్లను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నట్టు IG శ్రీజిత్ తెలియజేసారు.

.

One thought on “కేరళ పాస్టర్లకు గట్టి ఏదురు దెబ్బ, అంగీకరించని హైకొర్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!