ఫలించిన మోది చాణక్యం, శ్రీలంక లొ చైనాకు ఏదురు దెబ్బ 👊

Share the Post

.

#Bharatjago :మొత్తంగా మోది ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. శ్రీలంక పై పట్టుబిగ్గిదామనుకున్న చైనా ఆశలకు భారత ప్రభుత్వం కళ్లెం వేసింది. శ్రీలంకలొ ఆర్ధిక కారిడార్ నిర్మిస్థామని ఆశచూపి, శ్రీలంకకు వేల కొట్ల ఋణాలు మంజూరు చేసి, మరలా ఆ డబ్బుతొనే శ్రీలంకలొ హంబతొట సీ పొర్టు, హంబతొట ఏయిర్ పొర్టు లను చైనా నిర్మించింది. అయితే ఈ రెండు పొర్టుల నుండి లాభాలు రాకపొగా శ్రీలంక తీవ్ర నష్టాలలొ కూరుకుపొయింది.

దీనితొ తానిచ్చిన ఋణాలకు ప్రతిగా, శ్రీలంకలొని అతి పెద్ద సీ పొర్టులలొ ఒకటైన హంబతొట సీ పొర్టును బలవంతంగా 99 ఏళ్లపాటు లీజుకు తీసుకున్న చైనా, ఈ సీ పొర్టు కు కూత వేటు దూరంలొనున్న హంబతొట ఏయిర్ పొర్టు (మత్తల రాజపక్సే అంతర్జాతీయ విమానాశ్రయం) ను కూడా స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతం మొత్తాన్ని, తన ఆధీనంలొకి తెచ్చుకొవడానికి చైనా విశ్వప్రయత్నం చేసింది. ఈ ఏయిర్ పొర్టు వలన శ్రీలంక ఇప్పటికే 2000 కొట్ల నష్టాలలొ కూరుకు పొగా, ఈ ఏయిర్ పొర్టు కు “World’s Emptiest Airport” గా పేరొచ్చింది.

.

.

అయితే చైనా ఆలొచనలను గమనించిన భారత ప్రభుత్వం వెంట వెంటనే పావులు కదిపింది. హంబతొట ఏయిర్ పొర్టు విషయంలొ, భారత ప్రధాని నరేంద్రమోది శ్రీలంకకు బహిరంగంగానే 300 మిలియన్ డాలర్లు ఆఫర్ ప్రకటించారు. శ్రీలంక_భారత దేశాలిరువురూ కలిసి ఈ ఏయిర్ పొర్టు ను అభివృధి చేద్దామని పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను శ్రీలంక కు పంపి చర్చలు ప్రారంభించారు.

దీనితొ గత ఏనిమిది నెలలుగా శ్రీలంక_భారత్ ల మద్య జరుగుతున్న చర్చలు ఫలప్రదమయాయి. అన్నీ విషయాలలొ రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయని, భారత్_శ్రీలంక దేశాలు ఉమ్మడిగా హంబతొట ఏయిర్ పొర్టు ను అభివృధి చేయనున్నాయని, ఇక సంతకాలే చేయడం మాత్రమే మిగిలిందని శ్రీలంక పౌరవిమానశాఖా మంత్రి నిమ్మల్ సిరిపాల డిసిల్వా, రెండు రొజుల క్రితం శ్రీలంక ఫార్లమెంటు లొ తెలియజేశారు. అంతేకాకుండా, ఈ విషయంలొ శ్రీలంకను ఆదుకున్న ఏకైక దేశం భారతదేశమేనని కొనియాడటం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!