చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపిన ఇండియన్ రైల్వేస్, మొదటిసారి “రామాయణ ఏక్స్ ప్రెస్”

Share the Post

.

#Bharatjago : నూతన అధ్యాయానికి ఇండియన్ రైల్వేస్ నాంది పలిసింది …. భారత చరిత్రలొ మొదటిసారి పుణ్యక్షేత్రాలను కలుపుతూ “Pilgrim Train” ను ప్రారంభించనుంది. దీని పేరే  “రామాయణ ఏక్స్ ప్రెస్” …. ఇది ప్రధానంగా “రామాయణ సర్క్యుట్” అనగా అయొధ్య నుండి శ్రీలంక వరకు శ్రీరాముల వారికి సంబందించిన అన్నీ ప్రదేశాలను కలుపుతూ మొదటిసారి Pilgrim Train ను ప్రారంభించనుంది.

నవంబరు 14 నుండి పట్టాల కెక్కనున్న ఈ రామాయణ ఏక్స్ ప్రెస్, ముందుగా డిల్లీ నుండి ప్రారంభమై ఆయొధ్య, నందిగ్రాం, జనకపూర్, సీతామర్రి, ప్రయాగ, వారణాసి, చిత్రకూట్, శ్రింగవేరపుర్, నాసిక్, హంపి ల మీదగా రామేశ్వరం చేరుతుంది …. మరలా అక్కడి నుండి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్  లను చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్థారు.

ఈ పర్యటనమెత్తం, రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం, చారిత్రాత్మక కట్టడాలను, గురుతులను దగ్గరుండి చూపిస్థారు.  అంతేకాకుండా ఈ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ   రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు.

16 రొజులపాటు జరిగే ఈ ప్రయాణంలొ,  ఒక్కొక్క ట్రైన్ కు 800 మందికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికునిడి టిక్కెట్టు వెల 15,120 … భారతదేశంలొ మొదటిసారి ప్రారంభించనున్న రామాయణ ఏక్స్ ప్రెస్ ను నవంబరు 14 న భారత ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించనున్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!