పార్టీ కన్నా దేశం ముఖ్యం, అందుకే ఆ పని చేయలేదు – నరేంద్రమోది

Share the Post

#Bharatjago : అది 2014, భారతీయులు మోదీకి బ్రహ్మరధం పట్టిని సంవత్సరం.  దేశాన్ని అవినీతి నుండి బయటపడవేసి అభివృధి బాటలొ నడుపుతారని, దేశాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చేస్థారని నమ్మి ప్రజలు ఓటు వేసిన “నరేంద్ర దామోదర్ దాస్ మోదీ”  తిరుగులేని మెజారిటీతొ విజయం సాధించారు …. అయితే ప్రధానిగా భాద్యతలు స్వీకరించిన తరువాత మోది గారు, అప్పటిలొ ఘొరంగా ఉన్న దేశ ఆర్ధిక పరిస్తితులపై శ్వేతపత్రం విడుదల చేయకుండా,  దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలొ పెట్టేపనిలొ మునిగిపొయారు.

నిజానికి అప్పటి ఆర్ధిక వ్యవస్థపై శ్వేత పత్రం పార్లమెంటులో ప్రవేశపెడితే మోదీకి బిజేపికి ఎంతో మేలుజరుగుతుంది, అదేవిధంగా కాంగ్రెస్ కుటిల బుద్ది విస్పష్టంగా బయటపడేది, కాంగ్రెస్ నాయకులకు మాట్లాడటానికి అవకాశం లేకుండా పొయేది …. చిదంబరం అంకెల గారడి అనుమానస్పదంగా, రియాలిటీకి చాలా దూరంగా ఉంది ….  కాంగ్రేస్ అవినీతి కంపుతో దేశం అవినీతులో ర్యాంక్ సంపాదించిన కాలం, విదేశి కంపేనీలు పెట్టుబడులకు చొరవ చూపని కాలం, ప్రపంచంలో కుప్పకూలే మొదటి ఐదు దేశాలలో(Fragile Five) మన దేశం ఒకటి.

కాని దీనికి సంబందించిన  శ్వేత పత్రం పార్లమెంటులో ప్రవేశపెడితే   దేశానికి కీడు చెస్తుంది,  పెట్టుబడులు రావు,   భారతదేశం పై ప్రపంచ విఫణిలొ అనేక సందేహాలు తలెత్తుతాయి,  విదేశీ మారకద్రవ్యం తగ్గుముఖం పడుతుంది ….. ఇది గమనించిన మోది గారు తక్షణమే అలాంటి ఆలోచనలను తన మనసు నుంచి తొలిగించారు ….. ఆ శ్వేత పత్రం అనేది దేశ భవిష్యత్తుకు సంబందించినది కావడంతొ,  మరో మారు ఆలోచించకుండా వదనుకున్నారు.

ఇక దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలొ పెట్టే పనిని ప్రారంభించారు ….  ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి జవాబుదారి ఉండేలా చర్యలు ప్రారంభించారు. కేంద్రమంత్రులకు, అత్యున్నత స్థాయి అధికారులకు లక్సరీలను తొలగించారు ….  అధార్ అనుసందానంతో పేక్ రేషన్ కార్డుల లబ్దిదారులను తొలగించారు మరియు పక్కదారి పడుతున్న కేంద్ర ప్రబుత్వ పదకాలపై ఉక్కు పాదం మోపారు …. ఆధార్ అనుసందానంతో ప్రబుత్వ ఖజానాకు 78000 కోట్ల లాభం.సులభతర వాణిజ్యం కోసం 7000 సంస్కర్ణలు చేసారు.  Insolvency and bankruptcy code,  Fugitive Economic Order Bill చట్టాలను తీసుకు రావడం ద్వారా ఆర్ధిక నేరగాళ్లపై కొరడా ఝులిపించారు.

విదేశాలలొ పర్యటించి చరిత్రలొ మొదటిసారి చైనా కంటే ఏక్కువ పెట్టుబడులను భారత్ కు తీసుకురాగలిగారు ….  నోట్ల రద్దు మరియు GST వంటి   ఖటినమైన, కష్టతరమైన  సంస్కరణలను   ప్రవేశపెట్టగలిగారు … ఈ మార్గంలొ ప్రపంచంలొ మరే నాయకుడు ఏదుర్కొనన్ని అడ్దంకులు, విమర్శలు ఏదుర్కున్నప్పటికీ, ఏక్కడా వెనుకడుగు వేయలేదు … అంతిమంగా భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలొ పెట్తగలిగారు. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ 2.45 ట్రిలియన్ డాలర్లతొ, ప్రపంచంలొ అతి పెద్ద ఆరవ ఆర్ధిక వ్యవస్థగా రూపాంతరం చెందింది.

Note : నాలుగు సంవత్సరాల తరువాత మొదటిసారి ఈ విషయాలను మోది గారే తెలియజేశారు. ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్యూలొ మొదటిసారి ఈ విషయాలను బహిర్గతం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!