అమెరికాలొని పాకిస్థాన్ దౌత్యాధికారులపై, అమెరికా విచిత్రమైన ఆంక్షలు

Share the Post

.

Bharatjago#అవమానాలు, చీత్కారాలు, అసహ్యించుకొవడాలు పాకిస్థాన్ కు కొత్త కాదు. కాని ఈసారి అమెరికాలొని పాకిస్థాన్ దౌత్యవేత్తలపై అమెరికా కొత్త తరహా ఆంక్షలు విధించింది. అంటే దాదాపుగా ఒక నేరస్తులకు విధించే ఆంక్షల వంటివి.

అమెరికాలొని పాకిస్థాన్ దౌత్యకార్యాలయానికి సంబందించిన దౌత్యవేత్తలు, అధికారులు, ఇతర సిబ్బంది ఏట్టి పరిస్తితులలొ … తమ దౌత్య కార్యాలయం నుండి 25 కిలొమీటర్లకు మించి ఏక్కడికి వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ తమ దౌత్యకార్యలయం నుండి 25 కిలొమీటర్లు దాటి వెళితే శిక్షర్హులవుతారు.

ఒకవేళ పాకిస్థాన్ దౌత్య సిబ్బంది, ఏక్కడికైనా, ఏప్పుడైనా వెళ్ళాలనుకుంటే …. తప్పని సరిగా అమెరికా ఏజెన్సీల నుండి అనుమతి తీసుకొని మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఐదు రొజుల ముందుగా అమెరికన్ ఏజెన్సీ కు దరఖాస్తు చేసుకొవాలి. దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికిచ్చే సమయం కేవలం 48 గంతలు మాత్రమే. అంటే 48 గంటలు మాత్రమే వారి అమెరికాలొ తిరిగే అవకాశం ఉంటుంది.

వచ్చే నెల 1 వ తారికు నుండి ఈ అంక్షలు అమలులొకి రానున్నాయి. దీనికి సంబందించిన నొటీసు ను అమెరికా మార్చి లొనే పాకిస్థాన్ దౌత్యకార్యాలయానికి పంపినట్టు తెలుస్తుంది.  అయితే ఈ విషయం బయటకు పొక్కితే తమ పరువు పొతుందని, మిగిలిన దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలే విధిస్థాయని, కాబట్టి బయటకు మాత్రం అలాంటిదేమి లేదని చెప్పమని, అమెరికా అధికారులను పాకిస్థాన్ ప్రాధేయపడుతుందిట.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!