గత నాలుగు సంవత్సరాలలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లకు కేంధ్రనిధులు ఎన్ని వచ్చాయో తేలుసా ???

Share the Post

చంద్రబాబు తన 4 సంవత్సరాల పాలనలో చేసింది ఏమి లేదు, ప్రజలకు చూపించటానికి ఏమి లేదు.

అసలు కేంద్రం ఏ సహాయం చేయటం లేదు అని నాలుగు సంవత్సరాల తరవాత ఒక సరికొత్త డ్రామాను మొదలుపెట్టారు.

నిజంగా కేంద్రం ఏమి చేయటం లేదా, మాములుగా ఇంగితజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఆలోచిద్దాం. ఒక వేళ కేంద్రం ఏమి చేయకపొతే 4 సంవత్సరాలు టిడిపి నాయకులు కేంద్రంలో ఎందుకు మంత్రి పదువులు అనుభవించారు.అయితే తెలుగుదేశం తెలుగు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారా.నాలుగు సంవత్సరాలు నిద్రపోయారా చంద్రబాబు లేక ప్రజలలో వ్యతిరేకతతో సానుభూతి కోసం ఆడుతున్న డ్రామానా.ఎవరిని మోసం చేస్తారు బాబు గారు.ఇది ఇలా ఉంటే భారత్ జాగో టీమ్ వివద రాష్ట్రాల కేంద్ర గ్రాంట్స్ ను పరిసీలించి మీ ముందుకు ఒక విశ్లేషనను ఆదారాలతో వివరింపబడుతుంది

ఈ విశ్లేషనకు మేము వాడిన మూలం https://www.apfinance.gov.in/budget.html

ఈ క్రింది విశ్లేషనతో చంద్రబాబు ఆంద్ర ప్రజలను ఎలా తప్పుదారి  పట్టిస్తున్నారొ  పూర్తిగా వివరించబడింది.ఈ విషయాలు ప్రజలకు తెలియదు అనుకుంటారా, ఆంద్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారా మీరు.నిజాన్ని ఎవ్వరు దాచలేరు.సానుభూతితో కొంతకాలం పబ్బం గడపచ్చు అన్నిరోజులు కాదు.

 

కొన్నిరోజులు కొంత మందిని మోసం చేయవచ్చు కాని అన్ని రోజులు అందరిని మోసం చేయలేమని గుర్తుపెట్టుకోవాలి.

ఈ క్రింది పొందుపరిచిన ఇమేజస్ apfinance వెబ్ సైట్ నుంచి డేటా పొందుపరిచిన వాటి నుండి తీసుకున్నవి.

2012-2013, 2013-2014 కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు గమనించగలరు.

2014-2015 తర్వాత విభజన జరిగిన ఆంధ్ర ప్రదేశ్ కి ఎన్ని నిధులు ఇచ్చారో కూడ గమనించగలరు. వీటిని చూస్తే మనకు అర్ధం అవుతుంది . మోదీ ప్రబుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ది. చంద్రబాబు గారు ఇవి మీ ప్రభుత్వం పొందు పరిచిన డేటాలోనివే. చంద్రబాబు గారు ఎవరిని మోసం చేస్తారు.

 

 

ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసింది కాంగ్రేస్ మాత్రమే. 32 ఎంపిలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2012 నుండి 2014 వరకు కర్ణాటకతో పోల్చితే చాలా తక్కువ ఇచ్చారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్  జనాభా 8,46,73,556. కర్ణాటక జనాభా 6,11,30,704.

2012-2013 ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన కేంద్ర నిధులు 7,685.3248 కోట్లు.

2012-2013 కర్ణాటకకు ఇచ్చిన కేంద్ర నిధులు 13,353.53 కోట్లు

2013-2014 ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన కేంద్ర నిధులు 8,990.5559 కోట్లు.

2013-2014 కర్ణాటకకు ఇచ్చిన కేంద్ర నిధులు 15,094.84 కోట్లు

ఆంధ్రులారా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రేస్ మరియు ఇచ్చిన నిధులను ఇప్పుడు తప్పుదారి పట్టించి రాష్ట్ర ఆభివృద్ధికి నిరోధకంగా మారిన తెలుగుదేశం కూడ దీనిలో భాగంకాక తప్పదు.

చేతిలో మీడియాను పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలకు నిజాలు తెలవదు అనుకుంటారా ఆ రోజులు పోయాయి.

 

కర్ణాటకకు కేంద్ర నిధుల వివరాలు

అలాగే గుజరాత్ కి మోదీ గారు ఎక్కువ నిధులు ఇస్తున్నారు అనే తెలుగుదేశం వాదన కూడ తప్పు. ఈ క్రింది ఇమేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇకనైన సానుభూతి మరియు ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోకుండా అభివృద్ధి పై అడుగులు వేయాలని సాటి ఆంధ్రుడిగా మనవి.

 

 

https://financedepartment.gujarat.gov.in/Budget-in-brief.html

http://finance.kar.nic.in/Bud2017/bud2017.htm

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!