అదరగొట్టిన ఇండియన్ డిఫెన్స్‌ ఎక్స్‌పో, పెద్ద ఏత్తున పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు

Share the Post

.

#Bharatjago : నిన్నటి నుండి చెన్నై లొని తిరువిడందై లొ ప్రారంభమైన ఇండియన్ డిఫెన్స్‌ ఎక్స్‌పో, కు ఊహించని స్పందన వస్తుంది. బుధవారం నుండి శనివారం వరకు నాలుగు రొజుల వరకు జరగనున్న ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పో ను ఈ రొజు భారత ప్రధాని అధికారికంగా ప్రారంభించనున్నారు.

మొత్తంగా రెండు లక్షల చదరపు మీటర్ల స్థలంలొ ఏర్పాటైన ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పో లొ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, ఇజ్రాయిల్, కొరియా, బ్రిటన్ దేశాలతొపాటు మొత్తం 47 దేశాలకు చెందిన అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పో లొ పాల్గొన్నాయి.

.

 డిఫెన్స్‌ ఎక్స్‌పో లొ పాల్గొన్న భారత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్

.

మొత్తంగా 670 రక్షణ రంగ సంస్థలు పాల్గొనగా, అందులొ బొయింగ్, లక్ హీద్ మార్టిన్, ఎయిర్ బస్, సాబ్ లాంటి 154 అంతర్జాతీయ సంస్థలు పాల్గొనడం విశేషం. వీటితొ పాటు ప్రముఖ దేశీయ రక్షణ రంగ సంస్థలైన కల్యాణి గ్రూఫ్, అశొకాలైలాండ్, టాటా డిఫెన్స్ లాంటి 516 సంస్థలు ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పో లొ తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి.

భారత్ లొ ఇది 10 వ సైనిక ప్రధర్శన కాగా, ప్రస్తుతం జరుగుతున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో, ప్రపంచంలొని రక్షణ రంగానికి సంబందిచిన భారీ ఈవెంట్లలొ ఒకటిగా నిలిచింది. ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పో ద్వారా రక్షణ రంగ ఉత్పతులకు భారత్  Major Hub  గా ఆవిష్కరించబడనుంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!