నెరవేరనున్న దశాబ్ధాల కల, వచ్చే నెలలొ ప్రారంభం కానున్న అత్యంత కీలకమైన ప్రాజెక్టు

Share the Post

.

#Bharatjago : భారత రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు మొదటిసారి చెప్పుకొతగ్గ విజయం సాధించారు.  ఏట్టకేలకు అనేక సంవత్సరాలుగా ఏదురు చూస్తున్న కల నెరవేరనుంది. ఇండియన్ ఆర్మీ కి సంబందించిన అత్యంత కీలకమైన ప్రాజెక్టు వచ్చే నెలలొ ప్రారంభం కానుంది.

Armed Forces కు అత్యంత కీలకమైన అయుధాలు అసాల్ట్ రైఫిల్స్.  అయితే దురదృష్టవశాత్తు  ఆదునికమైన ఆసాల్ట్ రైఫిల్స్ ను  మన దేశంలొ డిజైన్ చేయలేక పొయాము. మోది ప్రభుత్వం వచ్చిన తరువాత DRDO కు రెండు అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఇండియన్ ఆర్మీ అవసరాలకు తగిన విధంగా అసాల్ట్ రైఫిల్ డిజైన్ ను చేయలేక పొవడంతొ …. రష్యాకు చెందిన ఆధునిక రైఫిల్స్  AK-103 ను భారత్ లొ తయారు చేసే విధంగా రష్యాతొ ఓప్పందం కుదుర్చుకున్నారు.

రష్యాకు చెందిన కలెష్నికొవ్ కన్సెర్న్ కంపెనీతొ కలిసి …. ఇండియా లొనే భారత ప్రభుత్వ రంగ సంస్థ “తిరుచ్చి ఆర్డినెన్స్ బొర్డు ఫ్యాక్టరీ”, ఇషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీ లొ అత్యాధునిక అసాల్ట్ రైఫిల్స్ అయిన  AK-103 లను భారత్ లొ తయారు చేయనున్నారు.

AK-103  అనేది మూడున్నర కేజీల బరువుండే అసాల్ట్ రైఫిల్. 2001 లొ తయారయిన 103  కు night vision and telescopic sights   అమర్చుకొవచ్చు.  అంతేకాకుండా గ్రైనేడ్ లాంచర్లను కూడా ఈ రైఫిల్ కు Fit  చేసుకొవచ్చు.  7.62 mm క్యాలిబర్ కలిగిఉండే ఈ అసాల్ట్ రైఫిల్,     నిమిషానికి ఆరువందల రౌండ్ల బుల్లెట్లను Fire  చేయగలదు.

నిర్మలా సీతారామన్ గారి మొన్నటి (3-5) రష్యా పర్యటనలొ ఈ ఒప్పందం పై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇది Government To Government Deal.  ఈ నెల 24 తారీకున భారత కంపెనీల జనరల్ మేనేజర్లు రష్యాలొ పర్యటించి తమ అభిప్రాయాన్ని తెలియజేసిన తరువాత (ఇది రెండవసారి), ఈ నెలాఖరున రక్షణశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, రష్యాలొ పర్యటించనున్నారు. ఆయన పర్యటనలొ దీనికి సంబందించిన ఒప్పందం పై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!