వచ్చి రావడంతొనే, తనదైన శైలిలొ దూసుకు పొతున్న రాంమాధవ్

Share the Post

.

#Bharatjago : గత నాలుగు సంవత్సరాలుగా పక్కా ప్లాన్ ప్రకారం బిజెపి పై బురద చల్లుతూ ఒక వర్గం మీడియా, కొన్ని పార్టీలు  ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలొ ఆంద్రప్రదేశ్ బిజెపి కు సరయిన మార్గనిర్దేశకులు లేకపొవడం, సరయిన నాయకత్వం లేక పొవడం, పైగా టిడిపి కొసం మాత్రమే పనిచేసే కొందరు నాయకులు బిజెపి లొ ఉండటంతొ …. బిజెపి కి వ్యతిరేకంగా జరుగుతున్న విష ప్రచారానికి అడ్డే లేకుండా పొయింది. దీనితొ ఆంద్రప్రదేశ్ ప్రజలలొ బిజెపి పై దురభిప్రాయం ఏర్పరిచే విషయంలొ సక్సెస్ ఆయ్యారు.

అయితే ఇనాళ్ళు … మిత్రధర్మం, మిత్రధర్మం అంటూ ఆంద్రప్రదేశ్ బిజెపి ను బలపరిచే విషయంలొ, తాబేలు కన్నా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకున్న బిజెపి అధిష్టానం, ఇప్పుడు టిడిపి NDA నుండి బయటకు రావడంతొ,  బిజెపి కి తత్వం భొధపడింది. వెంటనే మెరుపు వేగంతొ నిర్ణయాలు తీసుకుంటుంది. అందులొ కీలక నిర్ణయం ఆంద్రప్రదేశ్ బిజెపి వ్యవహారాలను బిజెపి జాతీయ కార్యదర్శి రాంమాధవ్ కు అప్పగించడం.

ముందుగా Damage Control  చేయడానికి రాంమాధవ్ గారు నడుంబిగించారు. వచ్చి రావడంతొనే, తాము ఇక నుండి ఏలాంటి ప్రణాళికలను అమలు చేయనున్నామనే విషయాలను, మీడియా కు సంక్షిప్తంగా తెలియజేశారు. ఇప్పటి వరకు టిడిపి, చంద్రబాబు నాయుడు తమను ప్రశ్నించారని ….. వాటన్నింటికీ సమాధానం చెబుతామని … అలాగే ఇక నుండి తాము కూడా టిడిపి ని ప్రశ్నిస్థామని, వాటికి సమాధానం చెప్పల్సిన భాద్యత టిడిపి పై ఉందని ఆయన తెలియజేశారు.  అంటే జరుగుతున్న పరిణామాలపై ప్రజలను మరింత లొతుగా ఆలొచింప చేయడం ద్వారా, ప్రజలు వారంతట వారే నిజాలు తెలుసుకునేలా చేయడం. ఇప్పటి వరకు రాంమాధవ్ గారు, దాదాపు ప్రతి రాష్ట్రంలొ దాదాపు అటు ఇటు గా ఇలాంటి విధానాల ద్వారానే చెప్పుకొతగ్గ ఫలితాలను రాబట్ట గలిగారు.

నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందని తెలిపిన రాంమాధవ్ గారు … ఏపీలో సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, అందుకు కౌంటరు గా అభివృధి కి సంబందించిన సమాధానాలతొ ఏదుర్కొంటామని ఆయన తెలియజేశారు.

వచ్చే ఏన్నికలలొ ఆంద్రప్రదేశ్ లొ ఏ పార్టీ తొ పొత్తు పెట్టుకునే పరిస్తితే లేదని స్పష్టం చేసిన రాంమాధవ్ గారు ….. ముందుగా రాస్ట్రంలొ జరుగుతున్న, జరిగిన పరిణామాలపై ప్రజలలొ అవగాహన తెచ్చేందుకు,  మరింత  ఏడ్యుకేట్ చేసి నిజనిజాలు తెలియజేసేందుకు   …. ఇప్పటికే రూపొందించిన స్పష్టమైన కార్యచరణతొ  రాంమాధవ్ గారు రంగంలొకి దిగుతున్నారు.

.

.

#RamMadhav, #BJP_NationalGeneralSecretary,#AndhraPradesh, #BJPAndhraPradesh, #TDP, #India, #ChandrababuNaidu,  #BharatJago, #AndhraPolitics

2 thoughts on “వచ్చి రావడంతొనే, తనదైన శైలిలొ దూసుకు పొతున్న రాంమాధవ్

  • March 18, 2018 at 1:49 am
    Permalink

    రాంమాధవ్ గారు మీ మాట నమ్మకం ఉంది కాని చంద్రబాబు చాలా డేంజ‌ర్, ఆయన పరిచయాలు ఉన్నాయి, రెండు తెలుగు రాష్ర్టలలో బా.జ.పా.అభిమానులు, కార్రకర్తలు ఓటర్లు ఉన్నారు, ఓటర్లు ముఖమఖిగా మీకు ఓటు వేస్తే వారికి మద్దతు ఇస్తున్నారు, అందుకు మీకు చివరి అవకాశం ఇస్తాం, ఈ సారి రెండు రాష్ట్రలలో మీరు ఓంటరిగా పోటి చేయండి అని చెబుతున్నారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!