అవిశ్వాస తీర్మానంతొ విశ్వాసం కొల్పొయిన చంద్రబాబు

Share the Post

.

#Bharatjago : ఒక్కసారి జాతీయ రాజకీయాలలొకి లొతుగా వెళితే పరిస్తితులు ఏలా ఉంటాయొ చంద్రబాబు గారికి బాగా తెలిసొచ్చింది. 1996-2004 వరకు ఏలక్ట్రానిక్ మీడియా ప్రభావం పెద్దగా లేకపొవడం, సొషల్ మీడియా లేకపొవడం, కమ్యునికేషన్ వ్యవస్థ చాలా తక్కువగా ఉండటం, పైగా జాతీయ మీడియా దృష్టి ఆంద్రప్రదేశ్ పై తక్కువగా ఉండటంతొ అప్పటిలొ చంద్రబాబు కు పెద్దగా ఇబ్బంది కలుగలేదు.

అయితే ప్రస్తుతం NDA భాగస్వామిగా ఉండి, సడన్ గా బయటకు రావడమే కాకుండా, బిజెపి పై అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దత్తు తెలియజేయడంతొ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలొ ఒక్కసారిగా “Center of Attraction ” అయ్యారు.  దీనితొ జాతీయ మీడియా దృష్టి ఒక్కసారిగా చంద్రబాబు, టిడిపి లపైకి వెళ్ళింది. ఇక అవిశ్వాస తీర్మానం గురించి చర్చలు, డిబేట్లు చేయడం మొదలు పెట్టారు. దీనితొ ఈ నాలుగు సంవత్సరాలలొ ఆంద్రప్రదేశ్ పరిపాలనకు సంబందించిన ఒక్కొక్క విషయం బయటకు రావడం మొదలైంది.

సహజంగా జాతీయ మీడియా మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడుతూ, దుమ్ముదులుపుతారు. అయితే టిడిపి అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టిందొ, దాని వెనుకనున్న కారణాలేమిటొ అర్ధం కాని జాతీయ మీడియా ప్రధానంగా ఈ ప్రశ్నలతొ, టిడిపి ని గట్టిగా ప్రశ్నిస్తుంది.

1) అసలు అవిశ్వాస తీర్మానం ఏందుకు పెట్టారు
2) ఇప్పటి వరకు NDA లొ కొనసాగి, ఏన్నికల సమయంలొ బయటకు రావడానికి కారణం ఏమిటి
3) మొదట ప్రత్యేక ప్యాకేజి కి ఒప్పుకున్న చంద్రబాబు, ఇప్పుడు సడన్ గా యూ టర్న్ ఏందుకు తీసుకున్నాడు.
4) కేంద్రం కట్టాల్సిన పొలవరం ప్రాజెక్టు ను రాస్ట్రప్రభుత్వం ఏందుకు తీసుకుంది
5) గత నాలుగు సంవత్సరాలలొ అమరావతిలొ ఒక్క నిర్మాణం చేయకుండా, అమరావతి అబివృధి జరుగుతుదని ఏలా చెబుతున్నారు
6) అమరావతి కొసం కేంద్రం ఇచ్చిన 2,500 కొట్లు ఏమయ్యాయి.
7) DPR లు ఇచ్చామని చెబుతున్నారు కాబట్టి, పరిస్తితి ఇతవరకు వచ్చినప్పటికీ, DPR లు ఏందుకు బహిర్గతం చేయడం లేదు.
8) ఏన్నికల సంవత్సరంలొ బయటకు రావడం పొలిటికల్ మైలేజి కొసం కాదా
9) జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏక్కువ తలసరి ఆదాయం కలిగి ఉండి, సరాసరి లక్షన్నర కొట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతూ, ఆంద్రప్రదేశ్ వెనుకబడిందని ఏలా చెబుతారు.

ప్రధానంగా ఈ ప్రశ్నలను జాతీయ మీడియా సంధిస్తుంది. అయితే వీటిలొ ఏ ఒక్క ప్రశ్నకు, టిడిపి దగ్గర సరయిన సమాధానం లేకపొవడంతొ ఉక్కిరిబిక్కిరవుతుంది.. వీటికి తొడు కొత్త కొత్త విషయాలు బయట పడుతుండటంతొ  ( https://twitter.com/Hiranyareta/status/974799776381390853 )  ఇప్పటి వరకు జాతీయ స్థాయిలొ, కాస్థొ కూస్థొ పేరున్న చంద్రబాబు గారి ప్రతిష్ట వేగంగా మసకబార సాగింది.

దీనికి తొడు 10,11 పార్టీలతొ యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేద్దామనుకున్న చంద్రబాబుకు, KCR రూపంలొ మరొక ఏదురు దెబ్బ తగిలింది. మూడవ ఫ్రంట్ ను ఏర్పాటు చేద్దామనుకున్న KCR , తన ప్రయత్నలను ముమ్మరం చేస్తూ …. చంద్రబాబు, యునైటెడ్ ఫ్రంట్ లొకి తీసుకు వద్దామనుకున్న పార్టీలను, తన వైపుకు తిప్పుకొవడంతొ, ఆ ప్రయత్నం కూడా విఫలమైంది.

దీనితొ ఇక ఇప్పుడప్పుడే జాతీయ రాజకీయాలలొకి రాకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

.

.

#TDP, #ChandrababuNaidu, #NationalPolitics, #KCR, #BJP, #BharatiyaJanataParty, #India, #NDA, #Congress, #BharatJago, #NationalMedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!