దెబ్బకు దెబ్బ తీసిన భారత్, భయపడి వెనక్కు పిలిచిన పాకిస్థాన్

Share the Post

.

#Bharatjago : గత 70 సంవత్సరాల నుండి, తమ దేశంలొని భారతీయ రాయబారులను తీవ్ర ఇబ్బందులు పెడుతూ,   వేధింపులకు గురిచేస్తూ  రాక్షసానందం పొందిన పాకిస్థాన్ కు మొదటిసారి అదే రీతిలొ భారత్ నుండి ప్రతి చర్య ఏదురైంది ……  మొదటిసారి భారత్, పాకిస్థాన్ రాయబారికి చుక్కలు చూపించి, బెదర గొట్టింది.

పాకిస్థాన్ లొ నిర్మిస్తున్న భారతీయ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పై నాలుగు రొజుల క్రితం పాకిస్థాన్ ఏజెన్సీ ISI , దాడులు చేసి, పెద్ద ఏత్తున సొదాలు నిర్వహించింది. నిర్మాణంలొ ఉన్న ఈ కాంప్లెక్స్ కు కరెంటు, నీటి సరఫరాను ఆపివేశారు. అంతేకాకుండా పాకిస్థాన్ లొ ఉంటున్న భారతీయ హైకమీషనర్ “అజయ్ బిసారియా” పై గూఢ చర్యం చేసి, బెదిరించడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఇదే కాకుండా పాకిస్థాన్ లొ ఉంటున్న మరొక భారతీయ హైకమీషనర్ ఇంట్లొ చొరీ చేసి, అతని లాప్ టాప్ ను దొంగతనం చేశారు.

.

.

దీనితొ రగిలిపొయిన భారత ప్రభుతం, సరిగ్గా అదే రీతిలొ, మరొక మాటలొ చెప్పాలంటే అంత కన్నా కొంచెం ఏక్కువగానే భారత్ ప్రతి చర్యలు ప్రారంభించి, భారత్ లొ ఉన్న పాకిస్థాన్ రాయబారి సొహాలి మొహమ్మద్ ను బెదరగొట్టింది. కార్లతొ చేజింగ్ చేయడం, అతని కుటుంబం పై గూఢచర్యం నిర్వహించడం, కొత్త వ్యక్తులను సొహాలి మొహమ్మద్ ఇంటి పరిసర ప్రాంతాలలొ మొహరించడంతొ …. ఇంట్లొ నుండి బయటకు రావడానికి భయపడిన సొహాలి మొహమ్మద్, ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వానికి తెలియజేశారు.

తాను భారత్ లొ ఉండలేనని, తమను వేధింపులకు గురి చేస్తున్నారని,  ఇక్కడ తనకు  ప్రాణభయం ఉందని తెలుపడంతొ … చేసేది లేక పాకిస్థాన్, భారత్ లొ ఉన్న పాకిస్థాన్ హైకమీషనర్ సొహాలి మొహమ్మద్ ను తిరిగి పాకిస్థాన్ (Recall) కు పిలిపించింది.  పైగా భారత్ లొని పాక్ రాయబార కార్యాలయంలొ 500 మందికి పైగా పాకిస్థాన్ ఉద్యొగులు ఉన్నారని …. వియన్నా ఒప్పందం ప్రకారం … వారి భద్రత, రక్షణ ఏర్పాట్లను చూడాల్సిన భాద్యత పూర్తిగా భారత ప్రభుత్వం పైనే ఉందని  పాకిస్థాన్  సూక్తులు చెబుతుంది.

నిజానికి పాకిస్థాన్ లొ భారతీయ రాయబార కార్యాలయం పనిచేసే ఉద్యొగులను, హైకమీషనర్లను పాకిస్థాన్ వేధించడం ఇదేమి కొత్త కాదు. గత 70 సంవత్సరాల నుండి తరచుగా జరుగుతూ ఉన్నదే. మరొక విషయం ఏమిటంటే కొన్ని సంధర్బాలలొ పాకిస్థాన్ లొ పనిచేసే భారతీయ రాయబార కార్యాలయ ఉద్యొగులపై బౌతిక దాడులు చేశారు. అత్యంత అవమానకరమైన, తలెత్తుకొలేని ఈ సంఘటనలపై అప్పటి భారత ప్రభుత్వాల చేతకాని తనం వలన ఏమి చేయలేక పోయాము.

.

.

#India, #Pakistan, #IndiaHighCommissioner, #PakistanHighCommissioner, #SohailMohamood, #AjayBisaria, #Spying, #Harassment, #BilateralTensions, #GovernmentOfIndia, PMOIndia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!