Master stroke to Congress : బిజెపి లొ చేరనున్న ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి !!!

Share the Post

.

#Bharatjago : కాంగ్రెస్ కు త్వరలొ దిమ్మతిరిగే షాక్ తగలనున్నట్టు తెలుస్తుది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత సంపన్న రాస్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, తన పరివారంతొ కలిసి బిజెపి లొ చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఏవరొ కాదు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్. ముఖ్యమంత్రి కాక ముందు నుండి అమరేందర్ సింగ్, మోది గారికి మదత్తు గానే మాట్లాడుతున్నారు. పైగా కాంగ్రెస్ అధిష్టానాన్ని లెక్క చేయని ఏకైక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రమే.

.

.

1965 పాకిస్థాన్ యుధంలొ పాల్గొన్న కెప్టెన్ అమరీందర్ సింగ్, గత కొంత కాలంగా కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అద్యక్షునిగా రెండు నెలల క్రితం జరిగిన రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి కూడా అమరీందర్ సింగ్ హాజరవలేదు. 2016 లొ జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి, రాహుల్ గాంధి ఆర్మీ పై అనుమానాలు లేవనెత్తినప్పుడు, కెప్టెన్ అమరేందర్ సింగ్ ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. “దయచేసి ఆర్మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకండి, ఈ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా తీవ్రవాదాన్ని పెంచిపొషిస్తుంది పాకిస్థానేనని, పాకిస్థానే తీవ్రవాదాన్ని సృష్టిస్తుందన్న సంగతి ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. అప్పటికి ఆయన సియం కూడా కాదు.

2017 లొ జరిగిన పంజాబ్ ఏన్నికలలొ కాంగ్రెస్ కేవలం అమరీందర్ సింగ్ వల్లనే విజయం సాధించడంతొ, కాంగ్రెస్ పార్టీ కు ఆయనను సియం ను చేయక తప్పలేదు. అప్పటి నుండి మోది గారు తీసుకునే దాదాపు ప్రతి నిర్ణయాన్ని అమరీందర్ సింగ్ సమర్ధించేవారు.   EVM మిషన్లను బిజెపి టాంపరింగ్ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఏత్తున విమర్శలు చేస్తున్నప్పుడు …. బిజెపి టాంపరింగ్ చేస్తే నెనెలాగెలుస్థానని, కాంగ్రెస్ నాయకుల నొళ్ళు మూయించాడు. GST  కు సపొర్టు చేసిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు అమరీందర్ మాత్రమే. GST వలన పంజాబ్ గొప్ప ముందడుగు వేస్తుందని ప్రశంసించారు. సరిగ్గా గుజరాత్ ఏన్నికలకు 10 రొజుల ముందు, 1962 చైనా యుద్ధంలొ భారత్ ఓడిపొవడానికి కారణం, అప్పటి భారత ప్రభుత్వం (నెహ్రు) చేతకాని తనమేనని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక కెనడా ప్రధాని, అమరీందర్ సింగ్ ను అవమానించాడని, నరేంద్రమోది,యోగి ఆధిత్యనాధ్ లు కెనడా ప్రధానికి గట్టి గుణపాఠం చెప్పిన సంగతి తెలిసిందే. కాని రాహుల్ ఒక్కమాట మాట్లాడక పొగా, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన రమ్య లాంటి వారు బహిరంగంగా కెనడా ప్రధానికి మద్దత్తు పలికారు.

ఇవన్నీతీసి పక్కన పెడితే, ఆదివారం నాడు మోది గారు మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. “జూన్ తరువాత కాంగ్రెస్ పార్టీకి, ఒక్క నారాయన స్వామి (పాండిచ్చేరి ముఖ్యమంత్రి) తప్ప ఇంక ఏ సియం మిగలరని, మోది గారు చేసిన వ్యాఖ్యలకు తీవ్రప్రాధాన్యత సంతరించుకున్నాయి . కాంగ్రెస్ పాలిత మేఘాలయలొ ఈ రొజు ఏన్నికలు జరుగుతుండగా, మె, జూన్ లలొ కర్ణాటక ఏన్నికలు జరగనున్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత మరొక రాస్ట్రం పంజాబ్ మాత్రమే. అంటే పంజాబ్ ముఖ్యమంత్రి, బిజెపి లొ చేరుతున్నాడు అని అర్ధం వచ్చేలా మోది గారు మాట్లాడినట్టు తెలుస్తుంది.

అమరేందర్ సింగ్ ముఖ్యమంత్రి అయిన తరువాత సొనియా, రాహుల్ గాంధీల కన్నా ఏక్కువగా నరేంద్రమోది గారిని కలవడం విశేషం.

.

.

#CaptianAmarinderSingh, #punjab, #Punjab_CM, #CongressParty, #BJP, #RahulGandhi, #GST, #NarendraModi, #PMOIndia, #SoniaGandhi,  #BhaatiyaJanataParty

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!