ఇరాన్ తొ ఓప్పందంతొ భారత్ కు శాశ్వతంగా వదలిన పాకిస్థాన్, చైనా ల పీడ

Share the Post

.

#Bharatjago : మొత్తానికి భారత్ కల సాకారమయ్యింది. ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రొహాని భారత పర్యటనలొ, భారత్ కు ఇరాన్ కు మద్య  చబహార్ పొర్టు తొ సహా మొత్తం తొమ్మిది ఓప్పందాలు జరిగాయి. అందులొ అత్యంత కీలక మైనవి మూడు 1) చబహార్ పొర్టు 2) ఆయిల్ ఓప్పందం 3) ఇండియన్ మారక ద్రవ్యాన్ని ఇరాన్ లొ చెలామణి అయ్యేలా చేయడం.

ప్రధానంగా చబహర్ పొర్టు ఒప్పందం వలన మనకు శాశ్వతంగా పాకిస్థాన్, చైనా ల మీద ఆధాపడవలసిన అవసరం లేకుండా పొయింది. సముద్రమార్గం లేని Land Locked  దేశాలయిన ఆఫ్గనిస్థాన్, మద్య ఆసియా దేశాలకు భారత్ నుండి ఏగుమతులు చేయాలన్నా, దిగుమతులు చేసుకొవాలన్నా ఇప్పటి వరకు పాకిస్థాన్, చైనా లపై ఆధారపడవలసి వచ్చేది. దీనిని అలుసుగా తీసుకుని రెండు దేశాలు తమ ఇష్టం వచ్చినట్టు పన్నులు వసూళ్ళు చేయడం, రవాణా లొ ఆలస్యం చేయడం చేసేవి.

దీనితొ భారత్, అత్యంత ప్యూహాత్మకమైన చబహర్ లొ రెండవ పొర్టు అయిన షహిద్ భెహెష్తి పొర్టు నిర్మాణానికి పూనుకుంది. ఇది పాకిస్థాన్ లొని చైనా నిర్మించిన గ్వాదర్ పొర్టుకు కేవలం 70 కిలొమీటర్ల దూరంలొనే ఉంది. 2016 నుండి భారత్ శరవేగంగా నిర్మించిన ఈ పొర్టు నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది. మొత్తం ఐదు బెర్తులు కలిగి ఉండే ఈ పొర్టు నుండి, భారత్ మూడు నెలల క్రితం నుండే  అఫ్ఘనిస్థాన్ కు ఏగుమతులు చేయడం ప్రారంభించింది.

ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు పర్యటనలొ చబహార్ పొర్టు పై పూర్తిస్థాయిలొ ఓప్పందం కుదిరింది. తద్వారా 18 నెలల పాటు భారత్ పూర్తిగా ఈ పొర్టు ను ఉపయొగించుకొనుంది. ఇరాన్ తొ సంబందం లేకుండా పూర్తిగా భారతదేశమే ఇక్కడ ఏగుమతులు, దిగుమతులను చేయనుంది. తరువాతి నుండి ఈ పొర్టును ఇరాన్, ఆఫ్గనిస్థాన్, భారత్ లు కలిసి ఉపయొగించుకొనున్నాయి. త్వరలొ ప్రారంభించబొయే International North-South Transport  Corridor  లొ ఈ చబహార్ పొర్టు తొ సహా బందర్ అబ్బాస్ పొర్టులు కీలక పాత్ర పొషించనున్నాయి.  తద్వారా  ఈ పొర్టుల ద్వారానే భారత్ మద్య ఆసియా, తూర్పు యూరప్, రష్యా దేశాలకు ఏగుమతులు, దిగుమతులు చేసుకోనుంది.

దీనితొ ఈ చబహర్ పొర్టు ఓప్పందం ద్వారా పాకిస్థాన్, చైనా లపై శాశ్వతంగా ఆధాపడవలసిన అవసరం లేకుండా పొయింది.  ఇరాన్ పై అనేక ఆంక్షలు పెట్టిన అమెరికా, ఇరాన్_భారత్ వ్యాపార వాణిజ్యాలకు ఏటువంటి ఆంక్షలు పెట్టకుండా పూర్తి స్వచ్చ నివ్వడం విశేషం.

.

.

#Afghanistan, #Iran, #India, #Chabahar_Port, #BandarAbbas_port,  #ShahidBeheshti_Port, #Central Asia, #Pakistan, #China #Narendramodi, #HassanRouhani #Iran_President, #PMO_India

One thought on “ఇరాన్ తొ ఓప్పందంతొ భారత్ కు శాశ్వతంగా వదలిన పాకిస్థాన్, చైనా ల పీడ

  • May 8, 2018 at 2:13 am
    Permalink

    ధన్యవాదాలు నమో మీ అద్వితీయమైన ముందు చూపుకు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!