చరిత్రలొ అతి పెద్ద Mega Weapon Deal పై సంతకం చేసిన భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

Share the Post

.

#Bharatjago : సరిగ్గా జమ్ము లొని సుంజువాన ఆర్మీ క్యాంప్ పై తీవ్రవాదులు దాడి చేసిన మూడు రొజుల తరువాత భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అతి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భారత చరిత్రలొ ఏన్నడూ కనీవినీ ఏరుగని రీతిలొ 7,40,000 లక్షల ఆధునిక అసాల్ట్ రైఫిల్స్ ను, 16,500 లైట్ మిషన్ గన్స్ (LMG)   కొనుగొలు ప్రక్రియకు పచ్చజెండా ఊపారు.

కాగా ఈ 7.4 లక్షల అసాల్ట్ రైఫిల్స్ ను Make In India  లొనే తయారు చేయనుండటం విశేషం.  ఇవి 7.62×51 mm అసాల్ట్ రైఫిల్స్   వీటిని ఆర్డినెన్స్ బొర్డు ఫ్యాక్టరీ, భారత్ లొని కొన్ని ప్రైవేటు సంస్థలు కలిసి ఈ రైఫిల్స్ ను తయారు చేయనున్నాయి.  వీటి తయారీకయ్యే ఖర్చు అంచనా దాదాపు 15, 935 కొట్లు.  ఇక పొతే 16,500 అత్యాదునికమైన లైట్ మిషన్ గన్స్ (LMG) ను విదేశాల నుండి కొనుగొలు చేయనున్నారు.  వీటికయ్యే ఖర్చు దాదాపు 1,819 కొట్లు.

నిజానికి ఆర్మీ, నేవి, ఏయిర్ ఫొర్స్ లకు దాదాపు 43,732 లైట్ మిషన్ గన్స్ అవసరం. దీనితొ 16,500 గన్స్ ను విదేశాల నుండి కొనుగొలు చేసి, మిగతా 27,232 LMG లను Make In India  లొ తయారు చేయనున్నారు. ఈ 16,500 LMG లను కొనుగొలు చేసే విదేశీ కంపెనీ సహకారంతొ (టెక్నాలజీతొ) తొ భారత్ లొనే LMG ల తయారి ప్రారంభించనున్నారు.

కాగా పొయిన నెలలొ 3,547 కొట్లతొ 72,400 అసాల్ట్ రైఫిల్స్ (New-generation  ), 93,895 కార్బన్లు (CQB ) కొనుగొలు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇవి కాక ఇప్పుడు అదనంగా 7.4 లక్షల అసాల్ట్ రైఫిల్స్ ను భారత్ లొ తయారు చేయనున్నారు.

భారతదేశ చరిత్రలొ Small Arms (rifles, LMG, CQB, Guns ………..)  కు సంబందించింది ఇదే అతి పెద్ద మెగా డీల్.  ఇంతకు ముందటి మరే ఇతర డీల్స్ కూడా దీని దరిదాపులలొ కూడా లేవు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!