పాకిస్థాన్ పై మరొక మిలటరీ ఆపరేషన్ !!! సరిహద్దుల వద్ద యుద్ద సన్నాహాలు

Share the Post

.

#Bharatjago : మొన్న జమ్ము లొని Army Camp   పై జరిగిన తీవ్రవాదుల దాడిలొ ఐదుగురు జవానులతొ సహా, ఒక సాధారాణ పౌరుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడితొ అటు భారత ప్రభుత్వం, ఇటు ఆర్మీ రగిలిపొతున్నాయి. నిన్న భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాటలను బట్టి, సరిహద్దుల వద్దకు ఆర్మీ చేస్తున్న సన్నాహాలు చూసుంటే ఈసారి ధీటైన మిలటరీ ఆపరేషన్ తప్పదని పిస్తుంది.

నిన్న సీతారామన్ గారు మాట్లాడుతూ, పాకిస్థాన్ చేయించిన ఈ దాడులకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకొక తప్పదని ఆమె స్పష్టం చేశారు. జమ్ములొ జరిగిన ఉగ్రదాడిలొ పాకిస్థాన్ ప్రమేయం ఉందని, దీనికి సంబందించిన సాక్ష్యాలు ఇప్పటికే తమకు లభించాయని తెలిపారు. ఈ దాడులలొ పాల్గొన్నవారు జైషే మొహమ్మద్ కు చెందిన తీవ్రవాదులని, దీని వెనుక అజహర్ మసూద్ హస్థం ఉందని ఆమె తెలియజేశారు.

ఇక సీతారామన్ గారి మాటలకు పక్కన పెడితే, ఇండియన్ ఆర్మీ సరిహద్దుల వద్దకు పెద్ద ఏత్తున యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టంస్ ను తరలిస్తుంది. ఇప్పటికే ఆర్టిలరీ గన్స్ ను తరలించిన అర్మీ, ఇప్పుడు కొత్తగా యాంటీ ట్యాంక్ మిసైల్స్ ను Line of Control  వద్ద నున్న  forward post  లకు తరలిస్తుండటం విశేషం. దీనితొ పాకిస్థాన్ కు ధీటైన, బలమైన సమాధానమిచ్చేందుకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది.

.

.

ఇంతకు ముందులా సర్జికల్ స్ట్రైక్స్ కాకుండా, ఈసారికూడా సరిహద్దులు దాటి నేరుగా పాకిస్థాన్ ఆక్రమిక కాశ్మీరు లొని పాక్ స్థావరాలపై ఉన్నత శ్రేణి అయుధాలతొ, పెద్ద ఎత్తున విరుచుకుపడే అవకాశం కనిపిస్తుంది.

ఇందుకు పాకిస్థాన్ ఆర్మీ చేస్తున్న వ్యాఖ్యలు కూడ బలాన్ని చేకూరుస్తున్నాయి. సరిహద్దుల వద్ద ఇండియన్ అర్మీ కదలికలను గమనిస్తున్న పాకిస్థాన్, మాపై దాడి చేస్తే మేము తిరిగి దాడులు చేస్థామని, భారత్ లొ సర్ఝికల్ స్ట్రైక్స్ చేస్థామని గత రెండు రొజుల నుండి పాకిస్థాన్ ఆర్మీ అధికారులు ప్రకటనల మీద ప్రకటనలిస్తున్నారు. అంతేకాకుండా సరిహద్దుల వద్ద పాకిస్థాన్ సైన్యాన్ని కూడా సిద్దం చేస్తున్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!