టిడిపి ఎంపి గల్లా జయదేవ్ భాగొతాన్ని బయటపెట్టిన బిజెపి

Share the Post

.

#Bharatjago : బిజెపి కి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతి పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎంపి గల్లా జయదేవ్ పై బిజెపి విరుచుకు పడింది. సొమవారం ఒంగొలు లొ జరిగిన మీడియా సమావేశంలొ పాల్గొన్న బిజెపి రాస్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి పై ప్రజలలొ పెరిగిన అసహనాన్ని, బిజెపి పై నెట్టేందుకు ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకొమని హెచ్చరించారు.

ఈ సంధర్బంగా ఆయన గల్లా జయదేవ్ గురించి మాట్లాడుతూ “గల్లా జయదేవ్ చరిత్రంతా తనకు తెలుసునని, కాంగ్రెస్ పార్టీలొ ఉండి కుంభకొణాలు చేసి సంపాదించిన సొమ్మును టిడిపి కి డొనేషన్ గా ఇచ్చి ఏంపి గా గెలిచారని తెలిపారు. జయదేవ్ చరిత్రంగా భూకబ్జాలమయమని, లక్షలు విలువ చేసే Sc, St ల భూములను కారు చౌకగా కేవలం 40,000 కే కాజేశారన్నారు.   MR కేసులొ 130 కొట్ల కుంభకొణంలొ  CBI  ప్రత్యేక కొర్టు విచారనను ఏదుర్కొన్న చరిత్ర గల్లా జయదేవ్ దని ఆయన గుర్తు చేశారు. అమరావతికి చెందిన  Sc, St  ల భూములను తక్కువ ధరకు కొట్టేసెందుకే జయదేవ్ ప్లాన్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి చరిత్ర కలిగిన గల్లా జయదేవ్, బిజెపి ని విమర్శించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సురేష్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, తాత్కాలిక రాజధానికి 160 కొట్లు అని చెప్పి, ఏకంగా 1000 కొట్లకు పెంచారని, చదరపు అడుగుకు 10,000 చొప్పున వ్యయం చేసిన ఘనత టిడిపి పార్టీదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాజధాని నిర్మాణం కొసం ఇచ్చిన 2500 కొట్లను దేనికి ఖర్చు పెట్టరొ ఇంత వరకు ఏందుకు చెప్పడం లేదని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి పొలవరం నిర్మించే సామర్ధ్యం లేనప్పటికీ, అదే కంపెనీకు ఆ ప్రాజెక్టు అప్పగించి, ఇప్పుడు ఆ నిందను బిజెపి మీద నెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!