ప్రపంచంలొనే రెండవ అతి పెద్ద జురాసిక్ పార్క్ భారత్ లొ ఏక్కడుందొ తెలుసా..?? దాని కధేంటొ తెలుసా ??

Share the Post

.

#Bharatjago : జురాసిక్ పార్క్ అంటేనే డైనొసార్ పార్క్ అని అర్ధం. జురాసిక్ పార్క్ అనే హాలీఉడ్ సినిమా వచ్చే వరకు మనకు డైనొసార్ల గురించి పెద్దగా అవగాహన లేదు. కాని ఈ సినిమా రాక మునుపు 12 ఏళ్ల క్రితమే భారత్ లొ జురాసిక్ పార్క్ ఏర్పాటయింది. ఇదేదొ అషామాషి జురాసిక్ పార్కు కాదు … ప్రపంచంలొనే రెండవ అతి పెద్ద డైనొసార్ హేచరీ.

.

.

ఈ జురాసిక్ పార్క్, గుజరాత్ లొని గాంధీనగర్ దగ్గర ఇంద్రొడా ప్రాంతంలొ ఉంది. అందుకే దీనిని ఇంద్రొడా డైనొసార్ పార్కు గా పిలుస్థారు. 19 వ శతాబ్ధం లొనే గుజరాత్ లొని కచ్ ప్రాంతంలొ బ్రిటీష్ పరిశొధకులు ఇక్కడ డైనొసార్ శిలాజాలు కనుగొనప్పటికీ, తరువాత వీటి గురించి పెద్దగా పరిశొధనలు జరుగలేదు. అయితే 1982 – 84 లొ జియొలాజిలక్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాలలొ ఇక్కడి నర్మదా నది వ్యాలి లొ పెద్ద ఏత్తున డైనొసార్ శిలాజాలు, పుర్రె, ఏముకలు, డైనొసార్ గుడ్లు, కాలి గుర్తులు బయట పడ్దాయి. ఈ బయట పడిన డైనొసార్ గుడ్లలొ కొన్ని ఫిరంగి గుండు అంత పెద్దవి ఉండటం విశేషం. దీనితొ వెంటనే ఇక్కడ డైనొసార్ అవశేషలతొ డైనొసార్ పార్కు ను ఏర్పాటు చేశారు.

.

.

తరువాత 2003 లొ ఇక్కడ చికాగొ యూనివర్శిటీ, మిచ్చిగాన్ యూనివర్శిటీ పరిశొధకులు జరిపిన పరొశొధనలలొ అనేక విషయాలు వెలుగులొకి వచ్చాయి. ఈ ప్రాంతాలలొ ఒక్క డైనొసార్లు మాత్రమే కాకుండా, అంతకన్నా ఆత్యంత పెద్ద జంతువులైన టెర్రనొసారస్, మెగాలొసారస్, బ్రాచియొసారస్, అంతరాక్టొసారస్, స్టెగొసారస్ లు గుజరాత్ లొని పలు ప్రాంతాలలొ 70 లక్షల సంవత్సరాల క్రితం స్వేచ్చగా సంచరించేవని కనుగొన్నారు.

.

.

ముఖ్యంగా గుజరాత్ నుండి మద్య ప్రదేశ్ వరకు, నర్మదా నదీ తీరం వెంబటి డైనొసార్లు తిరుగాడుతూ ఉండేవని ఈ పరిశొధనలలొ కనుగొనారు. అందుకే ఈ డైనొసార్లకు రాజసారస్ అని పేరు పెట్టారు. అంతేకాకుందా ఇది ఆఫ్రికా లొని మడ్గాస్కర్ లొ జీవించిన మంజుంగాసారస్ ను పొలి ఉండటంతొ, 70 లక్షల సంవత్సరాల క్రితం మడ్గాస్కర్, గుజరాత్ లొ భాగంగా ఉండేదని అమెరికన్ శాస్త్రవేత్త పాల్ సెరీనొ తెలియజేశారు.

.

.

గాంధీనగర్ దగ్గరలొ 1982 లొనే ఇక్కడ డైనొసార్ శిలాజాలు, గుడ్లు బయటపడటంతొ, ఆప్రాంతంలొ డైనొసార్ పార్కుగా ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలొనే రెండవ అతి పెద్ద జురాసిక్ పార్కు కావడం విశేషం. కాని ఈ విషయం మన దేశంలొ చాలా మందికి తెలియక పొవడం దురదృష్టకరం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!