శెభాష్ యోగి జి … 2013 అల్లర్లతొ అతలాకుతలమై పొయిన ముజఫర్ నగర్, ఇప్పుడేలా ఉందొ తెలుసా ???

Share the Post

.

#Bharatjago : 2013 లొ ఉత్తరప్రదేశ్ లొని ముజఫర్ నగర్ లొ పెద్ద ఏత్తున అల్లర్లు జరిగాయి. జాట్లు, ముస్లింసు మద్య జరిగిన ఈ అల్లర్లలొ మొత్తంగా 70 మందికిపైగా మరణించగా, వేల మంది తీవ్రగాయాలపాలైయ్యారు.

అసలేం జరిగిందంటే

జాట్ సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని, కొందరు ముస్లిం యువకులు వేదింపులకు గురి చేయడంతొ, రెండు వర్గాల మద్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడాయి. ఈ విషయాన్ని మహాపంచాయితి లొ చర్చించి పాల్గొని తిరిగి వస్తున్న 2000 మంది జాట్ల పైన జాలీ కాలువ సమీపంలో రైఫిళ్లు మరియు ఇతర అధునాతన ఆయుధాలతో ముస్లిం వర్గం దాడికి పాల్పడ్డారు. దాడిలో 18 ట్రాక్టర్ ట్రాలీలు మరియు 3 మోటారుబైకులు అగ్నికి ఆహుతి అయ్యాయి. చనిపొయిన జాట్ల శరీరాలను కాలువ లోకి పడవేసారు.

దీనితొ బాధితులైన జాట్లకు అప్పటి అఖిలేష్ ప్రభుత్వం నుండి ఏటువంటి సహకారం అందకపొవడం, పొలీసులు ఏటువంటి చర్యలు తీసుకొక పొవడంతొ …. జాట్లు తిరిగి ముస్లింస్ పై పెద్ద ఏత్తున ప్రతీకార దాడులకు పాల్పడ్దారు. పెద్ద ఏత్తున జరిగిన ఈ అల్లర్లలొ 40 మందికి పైగా మరణించగా, దాదాపు 50,000 మంది ముస్లింసు, ముజఫర్ నగర్ ప్రాంతాన్ని వదిలి శరణార్థ శిబిరాలలొ తలదాచుకొవలసి వచ్చింది. అప్పటి నుండి ఇక్కడ పరిస్తితులు నివురు గప్పిన నిప్పులా మారాయి.

.

.

అయితే 2017 లొ యోగి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి, రెండు వర్గాల మద్య చర్చలు ప్రారంభించారు. ఈ రెండు వర్గాలను సమన్వయ పరచడం అంటే మాటలు కాదు. దీనితొ రెండు వర్గాల మద్య రాజీ కుదిర్చేందుకు యోగి ప్రభుత్వం, ముదుగా రెండు వర్గాలకు చెందిన పెద్దల సహాయం తీసుకున్నారు. తరువాత ఇరు వర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి రాజకీయనాయకులను ఒక అంగీకారానికి వచ్చేలా చేయగలిగారు. తరువాత రెండు వర్గాలకు చెందిన ప్రాంతాలలొ చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి ఇరు వర్గాలకు నచ్చచెప్పగలిగారు.

.

దీనితొ రెండు వర్గాలు రాజీకి రావడంతొ మొన్న ఫిబ్రవరి 4 వ తారీకున ముస్లింసు, జాట్లను కలిపి “బారా బస్తీ” గ్రామంలొ అతి పెద్ద మహా పాంచాయత్ ను ఏర్పాటు చేసారు (బారా బస్తీ గ్రామానికి “మిని పాకిస్థాన్” అని పేరుంది). ఈ మహా పంచాయత్ లొ పాల్గొన్న జాట్, ముస్లిం పెద్దలు ఏవరి తప్పులను వారు ఒప్పుకుని …… ఒకరి కొకరు క్షమాపణలు చెప్పుకున్నారు.

.

.

ఈ సంధర్బంగా పాల్గొన్న జాట్ పెద్దలు సొహనవీర్, విపిన్ బల్యాన్ లు ఈ మహా పంచాయితీలొ అల్లాహొ అక్బర్ అని నినాదాలు చేయగా …… ముస్లిం మత పెద్దలు హర హర మహాదేవ్ అంటూ రెండు వర్గాలు కలిసి పొయాయి. ఇక నుండి కలిసి మెలసి ఉంటామని ప్రమాణం చేశారు. దీనితొ ఆ ప్రాంతం నుండి వెళ్ళిపొయి, శరణార్ధ శిబిరాలలొ నివాస ముంటున్న ముస్లింలు మరల తిగిరి ముజఫర్ నగర్ వస్తుండటం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!