భారత జాతీయ జెండా ను గొప్పగా గౌరవించిన పాకిస్థాన్ క్రికెటర్ “షాహీద్ అఫ్రిది”.

Share the Post

.

#Bharatjago : ప్రపంచంలొ క్రికెట్,  Gentleman’s game గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే ….. అలాగే క్రికెటర్లు కూడా చాలా వరకు జెంటిల్ గానే వ్యవహరిస్తుంటారు. ఆ కొవకు చెందిన వాడే పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ.  స్విడ్జర్లాండ్ లొ గత రెండు రొజుల నుండి ఐస్ కైకెట్ మ్యాచ్చులు జరుగుతున్నాయి. ఈ సంధర్బంగా డైమండ్స్ , రాయల్స్ అనే రెండు గ్రూఫుల మద్య ఐస్ 20-20 మ్యాచ్ జరిగింది. ఇందులొ ఒక టీం కు సేహ్వాగ్ కెప్టెన్ కాగా, రెండవ టీం కు అఫ్రిదీ కెప్టెన్.

.

.

అయితే మ్యాచ్ అయిపొయిన అనంతరం షాహిద్ అఫ్రిది, గేలరీలొ ఉన్న ప్రేక్షకుల దగ్గరకు వెళ్ళాడు. ఈ సమయంలొ ఒక భారతీయురాలు షాహీద్ అఫ్రిదీని పిలిచి, తనతొ ఒక సెల్ఫీ కావాలని కొరింది. అయితే ఆ సమయంలొ ఆమె భారత జాతీయ జెండాను చేతిలొ మడిచి పట్టుకుంది.

ఇది గమనించిన షాహీద్ అఫ్రిది వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, ముందు తన చేతిలొ ఉన్న భారత జాతీయ జెండాను సరిగా పట్టుకొమని చెప్పి, ఆమె జాతీయ జెండాను సరిగా పట్టుకున్న తరువాత ఆమెతొ సెల్ఫీ దిగటం విశేషం. ఇంతకు ముందు కూడా షాహీద్ అఫ్రిది, భారతీయులను ఉద్దేశించి …. భారతీయులు పెద్ద మనసు ఉన్నవారని … ఆటలొ ఓడినా, గెలిచినా గొప్పగా రిసీవ్ చేసుకుంటారని ప్రశంసించారు.

.

.

క్రికెట్ ప్రపంచంలొ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఈ చర్య ద్వారా మరింత మంది క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యాడు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!