అసలు Khelo India అంటే ఏమిటి …. ??? … ఏంత మందికి తెలుసు …. ???

Share the Post

మోదీ గారు వచ్చాక దేశంలో ఎన్నో రంగాలలో సంస్కరణలు జరిగాయి.ఆర్ధిక , సామాజిక, పారిశ్రామిక, న్యాయపరమైన సంస్కరణలు జరిగాయి. ఇప్పుడు క్రీడా రంగం సంస్కరణలకు నడుం బిగించారు.

130 కోట్ల జనాభా పై మాటే కాని ఒలంపిక్స్ లో భారతదేశానికి వస్తున్న మెడల్స్ మాత్రం నామ మాత్రమే. అందులొ కూడా గొల్డ్ మెడల్స్ రావడం చాలా అరుదు.  చాలా చిన్న దేశాలు, అతి తక్కువ జనాభా గల దేశాలు ఎక్కువ పతకాలు గెలుచుకుంటున్నాయి. మన దేశంలో ఎంతో ప్రతిభ గల వారున్నారు అయినప్పటికి మనం పతకాలలో వెనుకంజలో ఉన్నాము. సరైన వ్యక్తులను గుర్తించి వాళ్ళకి ప్రోత్సహిస్తే మనం ఎన్నో పతకాలు సొంతం చేసుకోవచ్చు.

దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ గారు , ఖేలో ఇండియా ను ప్రాభించారు.

Khelo India School Games ద్వారా 1000 మంది నైపున్యంగల క్రీడాకారులకు ప్రతి సంవత్సరం 5 లక్షలు చప్పున 8 సంవత్సరాలు ఈ స్కాలర్ షిప్ లభిస్తుంది. తరువాత  Khelo India college Games ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సీటీల పరిధుల్లో స్పోర్టింగ్‌ ఎక్స్‌లెన్‌ హబ్‌లను నెలకొల్పనున్నారు. 10 ఏళ్ళ నుండి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండే దాదాపు 200 మిలియ‌న్ బాల‌లను ఒక పెద్ద జాతీయ శారీరిక ప‌టుత్వ ఉద్య‌మంలో భాగ‌స్తుల‌ను చేయాల‌న్న‌ది ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యాల‌లో ఒక‌టి.

ఖేలొ ఇండియా ప్రాజెక్టు కు మోది ప్రభుత్వం ప్రత్యేకంగా 1750 కొట్ల రూపాయలు కేటాయించింది.     2024, 2028 లో భారత్ క్రీడాకారులు ఒలంపిక్స్ వేదిక పై మువన్నెల జెండా రెపరెపలాడుతూ మరిన్ని పతకాలు కైవసం చేసుకొవాలనేదే ఖేలొ ఇండియా ఆశయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!