Enemy properties ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుండటంతొ భయపడుతున్న చైనా. ఏందుకొ తెలుసా ??

Share the Post

.

#Bharatjago : మోది ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి, ప్రధాని మోది ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాల కన్నా ముందు, చైనా నే ఏక్కువగా స్పందిస్తుంది. దేశ విభజన జరిగిన తరువాత, యుధ సమయాలలొ పాకిస్థాన్ వెళ్ళి అక్కడి పౌరసత్వం తీసుకున్నవారి ఆస్తులు ……….. 1962 చైనాతొ యుద్ధం తరువాత చైనా వెళ్ళిపొయి, చైనా పౌరసత్వం తీసుకున్న వారి ఆస్తులను (Enemy properties)  భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

చైనా, పాకిస్థానీలకు చెందిన 9,400 ఆస్తులు భారత్ లొ ఉండగా, వీటి విలువ లక్ష కొట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వీటిలొ 8000 కు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు మొన్నీ మద్య భారత హొంశాఖా మంత్రి రాజనాధ్ సింగ్ తెలియజేశారు. కేవలం వీటిని స్వాధీనం చేసుకొవడం కొసమే 49 ఏళ్ల కిందటి పాత చట్టాన్ని మోది ప్రభుత్వం పొయిన సంవత్సరం సవరించింది.

మోది ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలతొ చైనీస్ లొ గుబులు మొదలైంది. భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల వలన భారత్ లొ పెట్టుబడులు పెట్టిన చైనీస్ అభద్రతాభావానికి లొనవుతున్నారని చైనీస్ మీడియా గ్లొబల్ టైంస్ పత్రిక వెల్లడించింది. చైనా పౌరులు, చైనా కంపెనీలు భారత్ లొ వేల కొట్లు పెట్టుబడులు పెట్టారని అలాగే అనేక పరిశ్రమలు స్థాపించారని ఈ పత్రిక తెలియజెసింది. ముఖ్యంగా లెనొవా, క్సియోమి కంపెనీలు భారత్ లొ విపరీతంగా పెట్టుబడులు పెట్టాయని తెలియజేసింది.

ప్రస్తుతం సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్తితులు నెలకొనడంతొ, రేపేదయినా జరగరానిది జరిగితే మోది ప్రభుత్వం చైనీస్ ఆస్తులను, సంస్థలను స్వాధీనం చేసుకుంటుందని గ్లొబల్ టైంస్ పత్రిక భయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలొ అనేక మంది చైనీయులు కూడా అభద్రతా భావానికి లొనవుతున్నారని వెల్లడించింది. ముందుగా చైనీస్ ఆస్తులకు, సంస్థలకు, చైనా పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాద్యత భారత ప్రభుత్వానికుందని, లేనిచొ ప్రపంచంలొ భారత్ కు చెడ్ద పేరు రావడంతొ పాటు, భారత్ ను ఏవరూ నమ్మరని చైనీస్ మీడియా సుద్దులు చెప్పింది.

.

One thought on “Enemy properties ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుండటంతొ భయపడుతున్న చైనా. ఏందుకొ తెలుసా ??

  • February 8, 2018 at 1:27 am
    Permalink

    I like thi websit
    I learn more information
    Bharathmataki jai

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!