Big Diplomatic Win : చరిత్రలొ మొదటిసారి భారత్ కు అనుమతినిచ్చిన “సౌది అరేబియా”

Share the Post

.

#Bharatjago : మోది ప్రభుత్వ దౌత్య, విదేశాంగ విధానానికి సంబందించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. దాదాపుగా గత 60 సంవత్సరాలుగా  ఇజ్రాయిల్ తొ పాటు, ఇజ్రాయిల్ వెళ్ళే ఏ విమానామైనా తమ దేశం మీద నుండి వెళ్లకుండా సౌది అరేబియా ఆంక్షలు విధించింది. ఏ దేశం నుండైనా సరే, ఇజ్రాయిల్ కు వెళ్ళే ఏ విమానమైనా తమ గగనతలం మీద నుండి వెళ్ళనివ్వకుండా సౌది  నిషేధం విధించింది.

అయితే  చరిత్రలొ  మొదటిసారి సౌది అరేబియా ప్రభుత్వం, డిల్లీ నుండి ఇజ్రాయిల్ వెళ్లే విమానాలు తమ గగన తలాన్ని ఉపయోగించుకొవడానికి అనుమతి నిచ్చింది. ఇలా సౌది అరేబియా, తమ గగనతలం మీద నుండి ఇజ్రాయిల్ వెళ్లేందుకు అనుమతి నివ్వడం చరిత్రలొ ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇప్పటి వరకు భారత్ నుండి ఇజ్రాయిల్ వెళ్ళే విమానాలు దక్షిన యెమెన్ మీదగా, ఏర్ర సముద్రాన్ని క్రాస్ చేస్తూ ఇజ్రాయిల్ లొకి ప్రవేశించేవి. దీనితొ ఈ ప్రయాణ సమయం ఏనిమిది గంటలు పట్టేది. కాని ఇప్పుడు సౌది అరేబియా అనుమతి నివ్వడంతొ కేవలం రెండు గంటల వ్యవధిలొ భారత్ నుండి ఇజ్రాయిల్ చేరుకొవచ్చు. దీని వలన ఇజ్రాయిల్ వెళ్ళే విమాన చార్జీలు కూడా భారీగా తగ్గనున్నాయి.

దీనికి ఇజ్రాయిల్, సౌది అరేబియా ల మద్య ప్రారంభమైన సంబందాలే కాకుండా, అరేబియా రీజియన్ లొ పెరుగుతున్న మోది పలుకుబడి కూడా కారణమని ఇజ్రాయిల్ మీడియా హారిట్జ్ తెలియజేసింది. ఇది భారత ప్రభుత్వం సాధించిన పెద్ద దౌత్య విజయంగా ఈ పత్రిక పేర్కొంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!