Hatsoff To Sushma Swaraj : సురక్షితంగా బయట పడ్డ 22 మంది భారతీయులు

Share the Post

.

13,500 టన్నుల గ్యాసొలిన్ ను రవాణా చేస్తున్న “మెరైన్ ఏక్స్ ప్రెస్” అనే పేరుగల భారతీయ ఆయిల్ ట్యాంకర్ నౌక ఐదు రొజుల క్రితం హైజాక్ చేయబడింది. 22 మంది భారతీయ నావికులతొ పశ్చిమ ఆఫ్రికా లొని బెనిన్ హార్బర్ నుండి బయలు దేరిన ఈ నౌక ఫిబ్రవరి 1 వ తేదీన గినియా సముద్ర జలాలలొ సముద్రపు దొంగలు (Pirates)   హైజాక్ చేశారు.

ఈ ప్రాంతాలలొ సముద్రపు దొంగల సంఖ్య విపరీతంగా ఉంటుంది. నౌక హైజాక్ చేయబడిందని తెలియడంతొ వెంటనే భారత విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్, పశ్చిమ అఫ్రికా దేశాలలొని భారత రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేశారు. దీనితొ పాటుగా నైజీరియా, బెనిన్, గినియ ప్రభుత్వాలకు పొన్ చేసి హైజాక్ చేయబడిన నౌక ఆచూకి కొసం సహాయాన్ని కొరారు. దీనితొ సహయం చేయడానికి ఆయా దేశాలు రంగంలొకి దిగాయి.

కాని హైజాక్ చేయబడ్ద ఈ నౌకలొని అన్ని సిస్టంస్ ను, ఫొన్లను సముద్రపు దొంగలు స్విచ్ ఆఫ్ చేయడంతొ, ఈ నౌకను కనుగొనడం కష్టంగా మారింది. దీనితొ సుష్మస్వరాజ్ గారు ఆ దేశాలలొ ఉన్న భారతీయ అధికారులకు, అక్కడి ప్రైవేట్ ఏజెన్సీల సహాయం తీసుకొమని, డబ్బు గురించి ఆలొచించవద్దని చెప్పడంతొ ….. ఈ నౌక ఆచూకి కొసం భారత అధికారులు బెనిన్, గినియా లలొని పైవేటు ఏజెన్సీలను సంప్రదించారు…. సహజంగా ఇటువంటి ఏజెన్సీలకు సముద్రపు దొంగలతొ సంబందం ఉండటం ఇక్కడ సర్వ సాధారణం కావడంతొ, 24 గంటలలొ ఈ నౌక ఆచూకి కనుగొని, సముద్రపు దొంగలను ఏజెన్సీ ల ద్వారా చర్చలు జరిపించి నౌకను విడుదల చేయించారు.

నౌకతొ పాటు విడుదలయిన 22 మంది భారతీయులు క్షేమంగా ఉనట్టు సుష్మా స్వరాజ్ గారు తెలియజేశారు. సముద్రపు దొంగల నుండి విడుదలైన “మెరైన్ ఏక్స్ ప్రెస్” నౌక ఏటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగిస్తున్నట్టు DGS మలిని శంకర్ తెలిపారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!