మరొకసారి చైనీస్ పై దాడి చేసిన పాకిస్థానీలు

Share the Post

.

#Bharatjago : గత కొంత కాలంగా వేల సంఖ్యలొ చైనీస్, పాకిస్థాన్ లొని వలస వస్తుండటం, చైనీస్ వస్తువులు అమ్ముతూ పాకిస్థానీల పొట్టగొడుతుండటంతొ, గత కొంత కాలంగా పాకిస్థానీలు చైనీస్ పై ఆగ్రహంగా ఉన్నారు. దీనితొ తరచుగా చైనీస్, పాకిస్థానీల మద్య చిన చిన్న ఘర్షనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది పాకిస్థాన్ పొలీసులకు పెద్ద తలనెప్పిగా మారింది.

పొయిన సంవత్సరం బెలూచిస్థాన్ లొ చైనీస్ స్థావరం పై దాడి చేసి ఇద్దరు చైనీస్ ను చంపిన సంగతి తెలిసిందే. దీనితొ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా, ఈసారి మా పౌరులపై దాడి జరిగితే నేరుగా మా సైన్యమే వారిపై చర్యలు తీసుకుంటుందని పాకిస్థాన్ కు చైనా బహిరంగంగా వార్నింగ్ ఇచ్చింది.

మరలా నిన్న ఇద్దరు చైనీస్ పై పాకిస్థానీలు తుపాకులతొ కాల్పులకు తెగబడ్దారు. మొత్తం 10 రౌండ్లు జరిపిన కాల్పులలొ ఒక చైనీస్ తలలొ బుల్లెట్ దూసుకు పొయి మరణించగా, మరొక చైనీస్ కారు చాటున దాక్కుని గాయాలతొ బయట పడ్డాడు. వీరు చైనా నుండి పాకిస్థాన్ కు కార్గొ నౌకలొ చైనీస్ సరుకులు తీసుకువచ్చే ఉద్యొగులు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తులు మాస్కులు ధరించి ఉండటంతొ ఏవరు కాల్పులు జరిపారనేది తెలియడం లేదని కరాచి పొలీసు కమీషనర్ తెలిపారు.

అయితే చైనా నుండి కిరాణా వస్తువులు తీసుకువచ్చి పాకిస్థాన్ లొ అమ్మే సంస్థకు చెందిన ఉద్యొగులు కావడంతొ, కడుపు మండిన  సాధారణ  పాకిస్థాని పౌరులే ఈ పని చేసి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!