Big News : భారత్ సాయం కొరిన మాల్దీవులు సుప్రీంకొర్టు జడ్జిలు ….. ఏందుకొ తెలుసా .. ??

Share the Post

.

#Bharatjago : మన మిత్ర దేశమైన మాల్దీవులు తీవ్ర అంతర్గత సంక్షొభంలొ మునుగి పొయిన సంగతి తెలిసిందే. మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ పై  ప్రజలలొ,  ప్రభుత్వంలొ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతొ, అబ్దుల్లా యెమీన్ పదవి నుండి దిగి పొవాల్సిన పరిస్తితులు ఏర్పడ్దాయి.

దీనితొ మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్, ఇద్దరు ప్రతి పక్ష నేతలతొ పాటు పన్నెండు మంది MP లను తమ పదవుల నుండి తొలగించి, అరెస్టు చేయించాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన మాల్దీవులు సుప్రీంకొర్టు ‘అరెస్టు అయిన రాజకీయ నాయకులను విడుదల చేయాలని, వారిని తిరిగి MP లుగా నియమించాలని అబ్దుల్లా యెమీన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రవాసంలొ ఉన్న మాల్దీవులు మాజీ అధ్యక్షుడయిన మహమ్మద్ నషీద్ తిరిగి దేశానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని మాల్దీవులు సుప్రీం కొర్టు, ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆ పన్నెండు మంది MP లను తిరిగి నియమించినట్లయితే, తమ ప్రభుత్వం కూలిపొయే ప్రమాదం ఉండటంతొ అబ్ధుల్లా యమీన్, ఫార్లమెంట్ ను మూసివేసి, ఈ విషయంలొ కలుగ జేసుకొవద్దని సుప్రీం కొర్టు జడ్జిలకు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా అవసరమైతే సుప్రీం కొర్టు జడ్జీ లను అరెస్టు చేసే విధంగా సైన్యాన్ని, పొలీసులను పురమాయించాడు.

దీనితొ ఆగ్రహించిన మాల్దీవులు సుప్రీం కొర్టు, తమ దేశంలొ న్యాయవ్యవస్థను, ప్రజాసామ్యాన్ని కాపాడాలని భారత ప్రభుత్వ సాయం అర్ధించారు. (అయితే కాసేపటి క్రితం చైనా తొత్తుగా వ్యవహరించే మాల్దీవులకు చెందిన ఒక మీడియా సంస్థ సుప్రీం కొర్టు, భారతదేశ సహాయం కొరలేదని ప్రకటించింది) ………..

అయితే ఇందుకు కారణాలు లేకపొలేదు. మూడు నెలల క్రితం మాల్దీవులు అధ్యక్షుడు అబ్ధుల్లా యామీన్, తమ దేశ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చైనాతొ   Free Trade Agreement    కుదుర్చుకున్నాడు. ఆ విషయాన్ని కనీసం ప్రతి పక్షాలకు కూడా చెప్పకుండా ఫార్లమెంట్ లొ ఏక పక్షంగా ఈ బిల్లును ఆమొదించడంతొ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతలు మొదలయ్యాయి. దీనికి తొడు అబ్ధుల్లా యెమీన్ కు తీవ్రవాదులతొ కూడా సంబందాలున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సంవత్సరం మాల్దీవులలొ ఏన్నికలు జరిగితే ఖచ్చితంగా భారతదేశానికి మద్దత్తుదారుడైన మహమ్మద్ నవీద్ గెలిచే అవకాశాలు ఉండటంతొ, నవీద్ అధికారంలొకి రాగానే మాల్దీవులు, చైనాతొ కుదుర్చుకున్న  Free Trade Agreement ను రద్దు చేయించాలని భారత ప్రభుత్వం ఆలొచన చేస్తుంది.  అయితే ప్రస్తుత పరిస్తితులలొ భారతప్రభుత్వం ఏటువంటి నిర్ణయం తీసుకుంటుందొ వేచిచూడాలి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!