భారత్ దెబ్బకు మరొక మెట్టు దిగి వచ్చిన చైనా

Share the Post
.
#Bharatjago : రాజకీయంగా, సైనిక పరంగా, ఆర్ధికంగా వేగంగా బలపడుతున్న భారత్ ….. తన దౌత్య నీతితొ, విదేశాంగ విధానంతొ మరొక ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తున్న సంగతి తెలిసిందే. చైనా కు ఏమాత్రం తగ్గకుండా, గత కొంత కాలంగా భారత్ పంచ్ ల మీద పంచ్ లు ఇస్తుండటంతొ చైనా వెనక్కు తగ్గక తప్పడం లేదు. దీనితొ ఇనాళ్ళూ భారత్ ను పూచిక పుల్లలా తీసి వేసిన చైనా, ఇప్పుడు భారత్ పై ప్రేమను ఒలకబొస్తుంది.
 
దీనితొ ఇప్పటికే చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్ పై భారతదేశాన్నికున్న అనుమానాలను తొలగించడానికి భారత్ తొ చర్చలకు సిద్దమని చైనా ప్రకటించింది. ఇది మాత్రమే కాకుండా మొన్నటి భారత ప్రధాని నరేంద్రమోది గారి దావొస్ ప్రసంగాన్ని మొచ్చుకుంటూ, వ్యాపార_వాణిజ్యాలలొ భారత్ తొ కలిసి పనిచేస్థామని, సమాచారన్ని ఇచ్చిపుచ్చుకుంటామని ముందుకు వచ్చింది.
 
ఇప్పుడు చైనా మరొక మెట్టు కిందకు దిగి భారత్ తమకు గొప్ప పొరుగు దేశమని, భారత్ తొ తాము స్నేహాన్ని కొరుకుంటున్నామని తెలియజేసింది. భారత్ తొ సంబందాలకు చైనా విలువ, గౌరవాన్ని ఇస్తుందని పేర్కొంది. రెండు అతి పెద్ద పొరుగు దేశాలని, ఇరు దేశాలు గొప్ప ప్రాచీన నాగరికతను కలిగి ఉన్నాయని తెలిపింది. అలాగే తమ సార్వభౌమత్వాన్ని, తమ విలువలను కాపాడుకొవాల్సిన అవసరం కూడా తమకు ఉందని చైనీస్ విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి తెలియజేసారు.  మేము భారత్ తొ స్నేహాన్ని కొరుకుంటున్నాము కాబట్టే ధొక్లాం విషయంలొ ఏంతొ ఒర్పును ప్రదర్శించి, దౌత్య పరంగా పరిష్కరించామని ఆయన తెలియజేశారు.
 
మొత్తానికి భారత్ తగ్గి ఉన్నంతకాలం, మనల్ని ఒక ఆటాడించిన చైనా, ఇప్పుడు మనం తిరగబడటంతొ ఒక్కొక్క మెట్టు దిగి వస్తుంది. అయితే ఏప్పటికీ చైనాను నమ్మడానికి వీల్లేదన్న విషయం మోది ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!