Big Blow to China : మరొక అగ్రరాజ్యంతొ అతి పెద్ద “డిఫెన్స్ అగ్రిమెంట్” చేసుకొనున్న భారత్

Share the Post
.
#Bharatjago : హిందూ మహా సముద్రంలొ  చైనా నుండి పెరుగుతున్న సవాళ్ల నేపద్యంలొ, భవిష్యత్ తరాలను దృష్టిలొ పెట్టుకుని, ముందు జాగ్రత్తగా మోది ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలొ యురొపియన్ సూపర్ ఫవర్ #ఫ్రాన్స్ తొ భారత్ “డిఫెన్స్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్” చేసుకొనుంది. దీని ద్వారా ప్రపంచంలొని ఫ్రాన్స్ నావెల్ బేస్ లన్నింటినీ భారత్ ఉపయొగించుకునే అవకాశం లభిస్తుంది, అంతేకాకుండా ఫ్రెంచ్ నేవి తొ కలిసి హిందూ మహా సముద్రం, ఇండొ_ఫసిఫిక్ రీజియన్ లొ మరింత కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.
 
ముఖ్యంగా చైనా, హిందూ మహా సముద్రంలొ తన హవా ను పెంచుకుంటూ, పక్కా ప్యూహం ప్రకారం భారత్ చుట్టూ మిలటరీ స్థావరాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే
 
హిందూ మహా సముద్రంలొ కొన్ని ద్వీపాలు ఇప్పటికీ ప్రాన్స్ ఆధీనంలొ ఉన్నాయి, అంతేకాకుండా హిందూ మహా సముద్రానికి మూడు వైపులా ఫ్రాన్స్ నావెల్ బేస్ లను కలిగి ఉంది. దీనితొ పాటుగా ఈ ప్రాంతంలొ ఫ్రాన్స్ అత్యధిక Exclusive Economic Zone ను కలిగి ఉంది. అంతకు మించి ఫ్రాన్స్ మనకు మంచి మిత్రదేశం. భారత్, పొక్రాన్ అణుపరీక్షలు నిర్వహించినప్పుడు, రష్యా_ఇజ్రాయిల్ దేశాలతొ పాటు భారత్ కు మద్దత్తు ఇచ్చిన మరొక అగ్రరాజ్యం ఫ్రాన్స్ మాత్రమే.
 
దీనితొ ఇక మోది ప్రభుత్వం, ఫ్రాన్స్ తొ డిఫెన్స్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ చేసుకొవడానికి ముందుకు వచ్చింది. ఇది సరిగ్గా ఇంతకు ముందు భారత్, అమెరికాతొ చేసుకున్న LEMOA అగ్రిమెంట్ లాంటిది. దీని ద్వారా హిందూ మహా సముద్రం, ఇండొ_ఫసిఫిక్ రీజియన్ లొ భారత్ శక్తి మరింత పెరగనుంది.  హిందూ మహా సముద్రంలొ మడ్గాస్కర్, జిబౌటి, Réunion Island లతొ సహా మొత్తం ఐదు చొట్ల ఫ్రాన్స్ తమ మిలటరీ స్థావరాలను కలిగి ఉంది. ఈ అగ్రిమెంట్ ద్వారా భారత్ కూడా ఈ స్థావరాలను ఉపయొగించుకునే అవకాశం పొందుతుంది.
 
వచ్చే నెల మార్చి లొ ఫ్రాన్స్ అధ్యక్షుడు “ఇమాన్యుయల్ మక్రొన్” భారత్ లొ పర్యటించనున్న సంధర్బంగా ఇరు దేశాల మద్య ఈ ఒప్పందం జరగనుంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!