Big Blow To Anti Nations : మా విజయానికి కారణం భారతదేశమే – పెంటగాన్

Share the Post
.
#Bharatjago : ప్రపంచం మొత్తాన్ని శాసించే అమెరికన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్, భారత్ ను పొగడ్తలతొ ముంచెత్తింది. దక్షిణాసియా వ్యవహారాలలొ భారత్ కీలకపాత్ర పొషిస్తుందని, ముఖ్యంగా అమెరికా దక్షిణాసియా విదేశాంగ విధానం విజయవంతమవడానికి కారణం భారతదేశమేనని పెంటగాన్ ముఖ్య అధికార ప్రతినిధి “డానా వైట్” తెలియజేశారు.
.
.
ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ అమెరికా, భారత్ తొ బహుముఖ సంబందాలు కలిగి ఉందని పేర్కొన్నారు. దక్షిణాసియా అభివృధికి, తీవ్రవాదాన్ని అంతం చేయడానికి భారత్ పెద్ద మొత్తంలొ నిధిని కేటాయించిందని తెలియజేసారు. తీవ్రవాద వ్యతిరేక పొరాటంలొ భారత్, తమకు వైమానిక సౌకర్యాలను, వాటిని నిర్వహించే భాద్యతలను తమకు ఆఫర్ చేసిందని, ఇది చాలా గొప్ప విషయమని ఆమె తెలియజేశారు.  తీవ్రవాదాన్ని అంత‌మొందించేందుకు భాగస్వాములను భారత్ ఏకం చేస్తున్న తీరును  అభినందించారు.
 
ఏ దేశానికైనా వ్యూహాత్మక భాగస్వామ్యానికి, సంబందాలు ఏర్పరచుకొవడానికి భారతదేశం ఖచ్చితమైన ఊదాహరణ అని, కాబట్టే తాము భారత్ తొ సంబందాలు పెంపొందించుకుంటున్నామని పెంటగాన్ ముఖ్య అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తీవ్రవాదం పై పొరాటం విషయంలొ ప్రస్తుతం భారత్, ఖచ్చితమైన స్టాండ్ తీసుకుని ముందుకు వెళుతుందని, కాబట్టే మా పని సులువైందని ఆమె తెలిపారు. దక్షిణాసియాలొ అమెరికన్ స్ట్రాటజి విజయవంతమవడానికి కారణం భారతదేశమేనని ఆమె పేర్కొన్నారు.
.
దీనితొ ఇప్పటి వరకు మోది విదేశాంగ విధానం సరిగా లేదని, తీవ్రవాదం పై సరయిన చర్యలు తీసుకొవడం లేదని విమర్శిస్తున్న కుహనా లౌకిక వాదులకు, జాతి వ్యతిరేఖ శక్తుల నొటికి తాళం పడ్దట్టు అయ్యింది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!