Unsung heroes : రొడ్డు మీద కూరగాయలమ్ముతున్న ఈ అవ్వ దేశం కొసం ఏం చేసిందొ తెలుసా

Share the Post

#Bharatjago : తమ జీవితం మొత్తం దేశం కొసం పని చేసి కనుమరుగైనవారు (Unsung Heroes)  మన దేశంలొ ఎందరొ ఉన్నారు. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న సమాచార వ్యవస్థ వలన, మారిన ప్రభుత్వాల వలన ఇటువంటి వారి గురించి ప్రపంచానికి తెలుస్తుంది. అంటువంటి వారిలొ ఒకరు ఈ అవ్వ ….. పేరు “సుభాషిని మిస్త్రీ” (75 సంవత్సరాలు)

కలకత్తా కు చెందిన సుభాషిని మిస్త్రీ తన 24 వ ఏటనే తన భర్త, జీర్ణకొశవ్యాధితొ మరణించారు. కేవలం పేదరికం వలన తన భర్తకు సరయిన వైద్యం అందక మరణించారు. దీనితొ తీవ్ర ఆవేదన చెందిన సుభాషిని మిస్త్రీ, ఇక పేదవాళ్లెవ్వరూ పేదరికం వలన చనిపొకూడదని నిర్ణయించుకుంది.

తన నలుగురు కుమారులలొ మొదటి వాడిని డాక్టరు ను చేయడం కొసం అనాధాశ్రమంలొ చేర్చింది. మొదట ఆరు ఇళ్లలొ పని మనిషిగా చేరిన మిస్త్రీ, తరువాత  Park Circus అనే ప్రాంతంలొ కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించి డబ్బును పొదుపు చేయ సాగింది. అలా పొదుపు చేసిన సొమ్ముతొ తన భర్త సొంతం గ్రామమైన తరఖాపూర్ లొ స్థలాన్ని కొనుగొలు చేసి, హాస్పటల్ నిర్మించించి. ఇక అక్కడ పేదవారికి ఉచితవైద్యాన్ని అందించసాగారు. ఆమె కూరగాయలు అమ్మకాలతొ వచ్చిన డబ్బుతొ ఈ హాస్పటల్ ను నిర్వహిస్తుండేవారు.

ఆ తరువాత అనాధాశ్రమంలొ చేర్చిన తన పెద్ద కొడుకు డాక్టరయి తిరిగి రావడంతొ ఇక ఆ హాస్పటల్ నిర్వహణ భాద్యతలు చేపట్తారు. దీనితొ మిస్త్రీ, సుందరబన్స్ లొ మరొక హాస్పటల్ ను నిర్మించి పేదవారికి ఉచిత వైద్యం అందించసాగారు. ఇవికాక తను కూరగాయలమ్మే చొట ట్రాఫిక్ తొ ప్రజల ఇబ్బందులుపడుతుండటంతొ, మిస్త్రీ గారు అక్కడ Footbridge  నిర్మించారు. ఇవన్నీ కూడా సుభాషిని మిస్త్రీ తను ఇలా కూరాగాయలు అమ్మి వచ్చిన డబ్బు ద్వారానే ఈ పనులన్నీ చేయడం విశేషం.

ఆమె చేస్తున్న గొప్ప సామాజిక సేవలను గుర్తించిన మోది ప్రభుత్వం 2018 లొ ఆమెకు పద్మ శ్రీ అవార్డును ప్రకటించించి, మిస్త్రీ గారిని తగిన రీతిలొ గౌరవించింది. మిస్త్రీ గారి కొరిక మేరకు, ఇక నుండి అమె చేసే కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!